కన్యా శుల్కం లో పాట...శ్రీ శ్రీ ..రచన.

కన్యా శుల్కం లో పాట...శ్రీ శ్రీ ..రచన.


మహా నటి అభినయనం.


ఆనందం అర్ణవమైతే అనురాగం అంబరమైతే "ఆనందం"

అనురాగపు టంచులు చూస్తాం ఆనందపు లోతులు తీస్తాం "ఆనందం"

నీ కంకణ నిక్వాణంలో నా జీవన నిర్వాణంలో

నీ మదిలో డోలలు తూగి నా హృదిలో జ్వాలలు రేగి...

నీ తలపున రేకులు పూస్తే నా వలపున బాకులు దూస్తే

మరణానికి ప్రాణం పోస్తాం స్వర్గానికి నిచ్చెన వేస్తాం.. "ఆనందం"


ఆ.....

హసనానికి రాణివి నీవై వ్యసనానికి బానిస నేనై

విషమించిన మదీయ ఖేదం కుసుమించిన త్వదీయమోదం

ఆ....

విషవాయువులై ప్రసరిస్తే విరితేనియలై ప్రవహిస్తే

ప్రపంచమును పరిహసిస్తాం భవిష్యమును పరిపాలిస్తాం....

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!