Skip to main content
అమ్మా ఇదేదో బాగుందే.. కోతి వేషాలు, కోతి గెంతులు… కోతి కొమ్మచ్చులు”
“మై గాడ్ బయింగ్ బుక్స్! బార్బేరియస్! వర్స్ దాన్ సెల్లింగ్ గర్ల్స్!..” అన్నాడు గిరీశం.
.
పుస్తకానికి ఖోపం వచ్చేసింది.
పుస్తకాలతల్లి సరస్వతమ్మకి (అంటే సరస్వతిగారి అమ్మగారు కాదు – సరస్వతిగారే అమ్మగారు) ఇంకా చాలా ఖొపం వచ్చేసింది.
హాం ఫట్ అనగానే ముళ్ళపూడి వెంకట రమణ పుట్టాడు.
.
“అమ్మా ఒక పది కాణీలు వుంటే అప్పిస్తావా?” అన్నాడు పుట్టగానే.
.
“నీకు అప్పులిచ్చేవాళ్ళని తిప్పలిచ్చేవాళ్ళని మా ఆయన పుట్టిస్తున్నాడు గానీ నువ్వు నాకొక పని చేసి పెట్టాలి” అన్నది.
,
“ఓస్ అంతే కదా.. ఏమిటో చెప్పు” అన్నాడు రవణ
.
“ఈ టెలుగుస్ వున్నారే వీళ్ళకి పుస్తకం విలువ, చదువుల విలువ, అక్షరం విలువ అట్టే తెలిసినట్టు లేదు.. నువ్వెళ్ళి అలాంటి వాళ్ళందరిచేత పుస్తకం కొనేట్టు చెయ్యాలి..”
.
“హమ్మబాబోయ్.. అంత పని నా వల్ల కాదు నాకు ఎవరైనా తోడు కావాలి..”
.
“తోడుకేం తక్కువోయ్ – ఇదుగో బొమ్మల బాపు, అంత్యప్రాసల ఆరుద్ర, “పొగల”సెగల శ్రీశ్రీ, నండూరి నీకు ఫ్రెండూరి.. అందాల రాముడు అక్కినేని, దుక్కిపాటి, భానుమతి..”
.
“ఇంకా ఇంకా..!!”
.
“కష్టాలు కన్నీళ్ళు.. ఇబ్బందులు సొబ్బందులు..”
.
“విల విల లాడించే సంతోషాలు, పక పకలాడించే కష్టాలు..”
.
“హన్నా..”
.
“హ హ… ఇంకా చెప్తాను చూడు.. బుడుగు, సీగానపెసునాంబ, రెండు జెళ్ళ సీత, గోపాలం, అప్పుల అప్పారావు, జనతా ఎక్స్‌ప్రెస్ జనాలు.. వీళ్ళు నేను పుట్టించిన మనుషులు.. మీ ఆయన పుట్టించిన మనుషులకి నకలు డిటోకి కాపి స్ఫూర్తి..”
.
“ఏమిటా కోతివేషాలు..”
“అమ్మా ఇదేదో బాగుందే.. కోతి వేషాలు, కోతి గెంతులు… కోతి కొమ్మచ్చులు”
“తథాస్తు”
“మరి నువ్వు రావా అమ్మా..?”
.
“పిచ్చినాయనా.. నిన్ను చూసుకోడానికి నేనెందుకూ? నా బదులుగా తొమ్మిదిమంది అమ్మల్ని ఇస్తాను సరేనా?”
.
“సరే”
x
Comments
Post a Comment