చేతులారంగ శివునిఁ బూజింపఁడేని

చేతులారంగ శివునిఁ బూజింపఁడేని

నోరు నొవ్వంగ హరికీర్తి నుడువఁడేని

దయయు సత్యంబు లోనుగాఁ దలఁపఁడేనిఁ 

గలుగ నేటికిఁ దల్లుల కడుపుఁ జేటు.

.

భావము:

ఈ లోకంలో జన్మించిన ప్రతి ఒక్కడు చేతులారా శివుణ్ణి పూజించాలి, నోరారా కేశవుణ్ణి కీర్తించాలి, సత్యం కరుణ మున్నగు సద్గుణాలను అలవర్చుకోవాలి. అలా చేయని నిర్భాగ్యుడు ఈ లోకంలో పుట్టటం దేనికి తల్లి కడుపు చెడగొట్టటం దేనికి

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !