బాపు గారి శివ తాండవ చిత్రం.

..
బాపు గారి శివ తాండవ చిత్రం.

.

మధురము శివ మంత్రం మహిలో మరువక -ఓ! మనసా!

కాళహస్తి మహాత్మ్యం చిత్రంలోని ప్రతి ఒక్క పాట, ప్రతి ఒక్క పద్యం, ఒక రస గుళిక. ఎంతో అద్భుతంగా గానం చేసి పది కాలాలు నిలిచిపోయేలా చేసారు ఘంటసాల మాస్టారు. ఈ చిత్రం లోని ఇంకొక చక్కని పాట, తోలేటి వెంకట రెడ్డి గారు రచించిన "మధురము శివ మంత్రం". ఇందులో ఘంటసాల గారు ఎన్ని గమకాలు వాడారో చెప్పనక్కరలేదు. ముఖ్యంగా ఈ పాట పల్లవిలో "ఇహ పర సాధనమే" అన్న పంక్తిని అయిదు విధాలుగా ఒక్కోసారి ఒక్కోలా ఆలపిస్తారు.

సంగీతం: ఆర్. సుదర్శనం, ఆర్.గోవర్ధనం

గానం: ఘంటసాల

ప. మధురము శివమంత్రం మహిలో మరువక ఓ! మనసా! |మధురము|

ఇహపర సాధనమే....ఏ......ఏ.....

ఇహపర సాధనమే..

ఇహపర సాధనమే..

ఇహపర సాధనమే..

ఇహపర సాధనమే నరులకు సురుచిర తారకమే |ఇహపర|

ఆగమ సంచారా

ఆగమ సంచారా, నా స్వాగతమిదె గొనుమా.. |ఆగమ|

భావజ సంహారా...

భావజ సంహారా.....

భావజ సంహారా... నా నన్ను కావగ రావయ్యా |భావజ|

పాలను ముంచెదవో.. ఓ.. ఓ.. ఓ..

పాలను ముంచెదవో, మున్నీటను ముంచెదవో.. |పాలను|

భారము నీదయ్యా |భారము|

పాదము విడనయ్యా, నీ పాదము విడనయ్యా..

జయహే సర్వేశా!

జయహే సర్వేశా! సతి శాంభవి ప్రాణేశా!..ఆ.. |జయహే!|

కారుణ్య గుణసాగరా!..

కారుణ్య గుణసాగరా!

శ్రీకాళహస్తీశ్వరా నన్ను కాపాడవా శంకరా!

కారుణ్య గుణసాగరా!

శ్రీకాళహస్తీశ్వరా నన్ను కాపాడవా శంకరా!

మధురము శివమంత్రం మహిలో మరువక ఓ! మనసా!

ఇహపర సాధనమే నరులకు సురుచిర తారకమే

https://www.youtube.com/watch?v=jCqpufQMPhc

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!