యజమానుడు సేవకుడు....

యజమానుడు సేవకుడు....

ధర్మమూర్తియైన చిలుక మరియు ఇంద్రుల సంభాషణ

.కాశీపట్టణంలో ఒక బోయవాడు ఉండే వాడు. అతడు ఒక రోజు వేటకొరకు అడవికి వెళ్ళి ఒక లేడిమీద విషముపూసిన బాణమును వేసాడు. కాని ఆ బాణము గురితప్పి ఒక చెట్టును తాకింది. ఆ చెట్టు పూలుపండ్లతో నిండి ఉన్నది. ఆ విషపూరిత బాణము ఆ చెట్టును నిలువునా పూలు విరుగకాసిన పండ్లలతోసహా దహించివేసింది. 

.ఆ చెట్టు మీద నివసిస్తున్న చిలుక ఆ చెట్టు దహించ బడినా ఇన్ని రోజుల నుండి కాపాడిందన్న విశ్వాసంతో దానిని విడువక అక్కడే నివసించసాగింది. ఎండ వచ్చినా గాలి వచ్చినా వర్షము వచ్చినా అది ఆ చెట్టును విడువ లేదు. 

ఆ చిలుక గురించి విన్న ఇంద్రుడు మామూలు మనిషి రూపంలో దాని వద్దకు వచ్చి " ఓ చిలుకా ! ఈ చెట్టు మాడిపోయింది కదా ! ఈ అడవిలో ఫల పుష్పాలతో నిండిన ఇన్ని వృక్షాలు ఉండగా ఈ చెట్టును పట్టుకుని ఎందుకు వేలాడుతున్నావు " అని అడిగాడు. 

చిలికు " మహేంద్రా ! ఈ చెట్టు ఫలపుష్పాలతో నిన్ను నిండుగా ఉన్నప్పుడు ఆ చెట్టును అంటిపెట్టుకుని ఉండి ఆ చెట్టు ఎండి పోయినప్పుడు వదిలి వెళ్ళడము కృతగఘ్నత కాదా ! " అన్నది. 

మారువేషములో వచ్చిన నన్ను మహేంద్రా ! అని సంభోదించడం చూసి ఇంద్రుడు ఖంగుతిన్నాడు . ఈ చిలుక పూర్వ జన్మలలో చేసుకున్న పుణ్యఫలము వలన తనను గుర్తించిందని తెలుసుకుని " చిలుకా ! నా దర్శనం వ్యర్ధము కాదు కనుక ఏదైనా వరము కోరుకో " అన్నాడు. 

ఆ చిలుక " ఈ చెట్టును పూర్వము ఉన్నట్లు ఫలపుష్పాలతో అలరారే విధముగా చెయ్యి " అని కోరుకుంది. ఇంద్రుడు వెంటనే ఆ చెట్టు మీద అమృతమును చల్లాడు. ఆ చెట్టు పూర్వములా ఫలపుష్పాలతో శోభిల్లింది. 

ఇంద్రుడు వరమిచ్చినా తన కొరకు కోరుకొనక తనకు ఆశ్రయమిచ్చిన చెట్టు శ్రేయస్సును కోరుకున్న చిలుకలా భృత్యులు సదా యజమాని శ్రేయస్సు కోరుకుంటాడు

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!