పోతన తెలుగు భాగవతం.)

విష్ణుండు విశ్వంబు, విష్ణునికంటెను; 

వేఱేమియును లేదు విశ్వమునకు

భవవృద్ధిలయము లా పరమేశుచే నగు; 

నీ వెఱుంగుదు గాదె నీ ముఖమున

నెఱిఁగింప బడ్డది యేక దేశమున నీ; 

భువన భద్రమునకై పుట్టినట్టి

హరికళాజాతుండ వని విచారింపుము, ;

రమణతో హరిపరాక్రమము లెల్ల.....

టీకా:

విష్ణుండు = శ్రీహరే; విశ్వంబు = విశ్వము; విష్ణుని = హరి; కంటెను = కంటే; వేఱు = వేరైనది; ఏమియును = ఏమీకూడా; లేదు = లేదు; విశ్వము = విశ్వము; కున్ = కు; భవ = సృష్టి; వృద్ధి = స్థితి; లయములు = లయములు; ఆ = ఆ; పరమేశు = పరమమైన ఈశుని / భగవంతుని; చేన్ = చేతనే; అగున్ = అగును; నీవు = నీవు; ఎఱుంగుదు = తెలియుదువు; కాదె = కదా; నీ = నీ; ముఖమునన్ = నోటిద్వారానే; ఎఱిఁగింపబడ్డది = చెప్పబడినది; యేకదేశమునన్ = అంశముగ; ఈ = ఈ; భువన = లోకముల; భద్రమున = క్షేమము; కై = కొరకు; పుట్టినట్టి = అవతరించినట్టి; హరి = హరియొక్క; కళ = అంశతో; జాతుండవు = జన్మించినవాడవు; అని = అని; విచారింపుము = తెలిసికొనుము; రమణ = ప్రీతి; తోన్ = తో; హరి = హరియొక్క; పరాక్రమములు = సామర్థ్యములు; ఎల్లన్ = సమస్తము;

.

భావము:

ఈ విశాల ప్రపంచంలో విష్ణువు కంటె ఇతర మైనది ఏదీ లేదు. ఈ విశ్వమంతా విష్ణుమయం. ఆ పరమేశ్వరుని సంకల్పం చేతనే ఈ ప్రపంచానికి సృష్టి స్థితిసంహారాలు ఏర్పడుతుంటాయి. వ్యాస మహర్షీ! నీవు సర్వజ్ఞుడవు నీకు తెలియంది ఏముంది. నీవే ఒక చోట ఈ విషయాన్ని చెప్పి ఉన్నావు. ఈ విశ్వకల్యాణం కోసం మహావిష్ణువు అంశతో జన్నించానన్న మాట గుర్తు చేసుకో. అందువల్ల నీవు శ్రీహరి లీలావతారాలలోని విక్రమ విశేషాలను సంస్తుతించు మానవుని జ్ఞానానికీ, అధ్యయనానికీ, ఔదార్యానికీ, అనుష్ఠానానికీ, తపస్సుకూ, ధైర్యానికీ, సంపదకూ ప్రయోజనం పుణ్యశ్లోకుడైన పురుషోత్తముణ్ణి స్తుతించటమే.

(పోతన తెలుగు భాగవతం.)

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!