కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారు

కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారు సునిశిత పరిశీలనా దృష్టి ఎంతటిదో ఈ క్రింది వాక్యాల ద్వారా తెలియజేస్తాను...

.

"వర్షము పెద్దది కాజొచ్చెను.ఆ వానకు వడగండ్లు పడెను...ఒక పాము వానలో పరువెత్తుచుండెను. వడగండ్లు దాని శిరస్సును తాడించుచుండెను.అది పడగవిప్పి బుస్సుమనిలేచి ప్రక్కవాటుగా బొంయిమని వీచుచున్న గాలిని కసిగాట్లు కొరికి కష్టము మీద పోవుచుండెను".

వడగళ్ళు తన మీద పడుతూంటే పాము ప్రవర్తన ఎలా ఉంటుందో చూడండి.తననెవరో కసిదీర మోదుతున్నారని పాముకి కోపం.అక్కనా ప్రక్కనా ఎవరూ లేరు.హోరుమని వీస్తున్న గాలే అలా చేస్తూందనుకుందో,లేక తనకొచ్చిన ఉక్రోషాన్ని వెల్లగ్రక్కాలనుకుందో కసిదీరా కాట్లు వేస్తోందట. 

.

సత్యనారాయణగారు ఆశువుగా చెబుతూండగా, వారి తమ్ముడు వెంకటేశ్వర్లు గారు వ్రాసిన నవల వేయిపడగలు. కేవలం 29 రోజుల్లో వేయిపేజీల వెయ్యి పడగల ఉద్గ్రంథాన్ని వెలువరించడం విశ్వనాథ వారి పాండితీ ప్రకర్షకు నిదర్శనం. 

.

టైంమెషీన్‌లాంటి తన అద్భుతమైన రచనాశైలితో మనల్ని ఒక్కసారిగా మూడువందల ఏళ్ళు వెనక్కి తీసుకెళ్తారు. చూడాలన్న(చదవాలన్న)ఉత్సుకత ఉంటే సున్నితమైన ప్రతి విషయాన్ని మైక్రోస్కోపిక్ వర్ణనలతో దర్శింపచేసి జ్ఞాన పిపాసను తీరుస్తారు. ఆయన సునిశిత పరిశీలనా దృష్టి ఎంతటిదో ఈ క్రింది వాక్యాల ద్వారా తెలియజేస్తాను.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!