🌹🏵️అహ నా పెళ్ళంట - లక్ష్మీపతి!🤣🌹
🌹🏵️అహ నా పెళ్ళంట - లక్ష్మీపతి!🤣🌹 🤣🤔🤣🤔🤣🤔🤣🤔🤣🤔🤣🤔🤣🤔 ఆదివిష్ణు రాసిన 'సత్యం గారి ఇల్లు ' కధ/నవల లోని సత్యం పాత్రనే లక్ష్మీపతి గా మార్చారు.ఆ పాత్రలో కోట శ్రీనివాసరావు నిజంగా జీవించారనే చెప్పాలి. లక్ష్మీపతి పాత్రను తొలుత రావుగోపాలరావు చేత వేయించాలనుకున్నారు.లుక్ పరంగానూ,నేటివిటీ పరంగానూ ఆయన కరక్ట్ కాదేమోనని ఎవరో సందేహం వెలిబుచ్చటంతో జంధ్యాల కోటను ఎన్నుకున్నారు.అప్పటికి కోట సినిమా ఫీల్డ్ కొచ్చి రెండేళ్ళు అవుతోంది. సినిమాల్లోకొచ్చేముందు కోట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఉద్యోగం చేస్తూ తీరిక దొరికినప్పుడల్లా నాటకాలు ప్రదర్శిస్తూ ఉండేవారు.జంధ్యాల "అమరజీవి" సినిమా చేస్తున్నప్పుడు సరదాగా కోట తో ఓ వేషం వేయించారు. అక్కినేని ఇంటి ఓనర్ పాత్రలో కనిపిస్తారాయన.కోటకి నటునిగా తొలి చిత్రం "ప్రాణం ఖరీదు".ఆ సినిమా తర్వాత చాలా గ్యాప్ తో అమరజీవి లో నటించారు.తర్వాత బాబాయ్ అబ్బాయ్ లో కూడా ఓ పాత్ర పోషించారు. కోట కి ఎయిర్‌పోర్ట్ లో కనపడ్డ రామానాయుడు ఆహా నా పెళ్ళంట లో జంధ్యాల గారు నీతో పెద్ద వేషం వేయించాలనుకుంటున్నారు అని చెప్పడంతో తెగ ఆనందపడిపోయారు...