వాళ్ళే వ్రాసుకుంటారు-మనం నిమిత్తమాత్రులం ! 😁

సినిమా వాళ్ళు ,మన డైలాగులు మనల్ని వ్రాయనివ్వరు!


వాళ్ళే వ్రాసుకుంటారు-మనం నిమిత్తమాత్రులం !

😁


👉కొన్నేళ్ళక్రితం రాచకొండ విశ్వనాధ శాస్త్రిగారు ఒక సిన్మాకి మాటలు రాసే


నిమిత్తం మద్రాసు వెళ్ళారు.


కొన్నాళ్ళుండి తిరిగి విశాఖ వెళ్తున్న శాస్త్రి గారిని ఓ శిష్యుడు


“గురువు గారూ ఎలా వుంది సిన్మా ప్రపంచం?” అని అడిగాడు.


అందుకు శాస్త్రి గారు చిదానందంగా నవ్వి ఇలా అన్నారట.


“ఏముంది? బానే వుంది!


సిన్మా వాళ్ళతో చాలా సుఖం, మన గదికి మన్ని అద్దె చెల్లించనివ్వరు!


వాళ్ళే చెల్లిస్తారు. మన సిగరెట్లు మనం కొనే పని లేదు- వాళ్ళే కొనిస్తారు,


మన మందు మనం కొనక్కర్లేదు, మన తిండి మనల్ని తిననివ్వరు!


వాళ్ళే ఏర్పాటు చేస్తారు.


మన డైలాగులు మనల్ని వ్రాయనివ్వరు!


వాళ్ళే వ్రాసుకుంటారు


😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁

.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!