శ్రీకృష్ణ శతకం🌹 (రోజుకు ఒక పద్యం 19 1118)


శ్రీకృష్ణ శతకం🌹

(రోజుకు ఒక పద్యం 19 1118)


🏵️


నీవే తల్లివిఁ దండ్రివి

నీవే నా తోడు నీడ! నీవే సఖుడౌ

నీవే గురుడవు దైవము

నీవే నా పతియు గతియు! నిజముగ కృష్ణా


🏵️


భావం: ఓ కృష్ణా! నువ్వే నాకు తల్లి, తండ్రి. నిరంతరం నన్ను వెంటాడుతూ, నాకు తోడునీడగా ఉండేది నీవే. నీవే నాకు స్నేహితుడివి. నాకు గురువు, దేవుడు కూడా నీవే. నీవే నాకు ప్రభువు. నాకు దిక్కు నీవే. నా సమస్తము నీవే.


కృష్ణా అంటే ఓ కృష్ణా; నిజముగ అంటే వాస్తవంగా; నీవే అంటే నువ్వే; నాకు అంటే నిన్ను పూజించే నాకు; తల్లివి అంటే కనిపెంచే తల్లితో సమానం; తండ్రివి అంటే కన్నతండ్రివలె రక్షించేవాడివి; నీవే అంటే నువ్వే; నా తోడు అంటే నాకు సహాయకుడివి; నీడ అంటే వెన్నంటి ఉండే నీడ వంటి వాడివి; నీవే అంటే నువ్వే; సఖుడు + ఔ అంటే ప్రాణమిత్రుడివి; నీవే అంటే నువ్వే; గురుడవు అంటే అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ప్రసాదించేవాడివి; దైవము అంటే దేవుడవు; నీవే అంటే నువ్వే; నా పతియు అంటే నాకు ప్రభువు; గతియు అంటే దిక్కు.


ఈ ప్రపంచమంతా వ్యాపించి ఉన్నవాడు భగవంతుడని, ఆయనే శ్రీకృష్ణుడని కవి ఈ పద్యంలో వివరించాడు. ఇందులో ఉపయోగించిన పదాలన్నీ చాలా చిన్నవి. అతి సులువుగా నేర్చుకోవచ్చు. ఇటువంటి చిన్నచిన్న పద్యాలయితే పిల్లలు చక్కగా పలుకుతారు. పిల్లలకు బాల్యం నుంచే భగవంతుడికి నమస్కరించే అలవాటును ఇటువంటి పద్యాలతో ఆరంభిస్తే వారికి కూడా ఆసక్తి కలుగుతుంది.


🙏🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!