ఎస్ .వరలక్ష్మిమన స్వర లక్ష్మి !!

ఎస్ .వరలక్ష్మిమన స్వర లక్ష్మి !!

.

ఎం.ఎస్ .సుబ్బలక్ష్మి సరి తూగే గాయని 

జమున మించిన సత్య భామ ...

ఈమె సినిమాలలో నోరు కొద్దీ మాట్లాడే దురహంకారి:.

నక్కజిత్తుల మాయలమారి ,

ఈమె అంటే కోడళ్ళకు హడల్ ..అల్లులకు సవాల్ 

-

మా చిన్నప్పటి మంచి హీరోయిన్ 

మంచి నటి , గాయకురాలు.బాలరాజు లో ఈమె పాడిన రాగమాలిక 

"రూపం నీ య్యారయ్యా....పతి రూపం నీ య్యారయ్యా"శాస్త్రీయ సంగీతంలో ఒక తలమానిక. 

ఈమె సతి సావిత్రి ,సతి సక్కుబాయి సినిమాలు తీసి మునిగెరు. 

ఆమె తమిళ్ సిన్మాలు లో కూడా చాల ప్రముఖ నటి. ఆమె సినిమాకు ఆరోజులలో రేండు లక్షలు ఇచ్చేవారు.

ఆరోజులలో ఎం.ఎస్

.సుబ్బలక్ష్మి కి ఈమె పెద్ద పోటీ ఈమె ,ఈమె దురదృష్టం తెలుగు పుట్టుక పుట్టడం .


సహజ గాయని ఎస్. వరలక్ష్మి!

.

నా అభిమాన గాయని s.వరలక్ష్మి గారు. చాలా ప్రత్యేకమైన కంఠం ఆమెది

. “లీలా కృష్ణా నీ లీలలు నే లీలగనైనా తెలియనుగా!!” నేను తరుచూ hum చేసుకునే పాటల్లో ముఖ్యమైనది.

ఆవిడ పాటలే కాదు తన ధాటీ ఐన కంఠం తో పద్యాల్ని కూడా ఎంతో బాగా చదివేది. పద్య పఠనంలో పి.లీల గారిదీ , యస్ . వరలక్ష్మి గారిదీ ప్రత్యేకమైన బాణీ!!


శాస్త్రీయ సంగీతం లోనూ ఆమె కంఠం పాలువాయి భానుమతి గారిలాగా విశిష్టమైనది

.

సినిమా పాట – ‘మీర జాలగలడా’. దీని వెనకున్న కథ కాస్త పెద్దది.


మీర జాలగలడా నా యానతి


‘గంధర్వ గోత్రాన పుట్టిన తెరవేలుపులు’ అనే వ్యాసంలో (’మోహిని’ – ఆంధ్రప్రభ విశేష ప్రచురణ, రెండవ భాగం, 1999) వి.ఎ.కె. రంగారావు గారు ఎస్. వరలక్ష్మి గురించి ఇలా రాశారు:

“‘మీర జాలగలడా’ ఆమె పాడిన తీరు అద్వితీయం. రికార్డులపై ఆ పాట స్థానం నరసింహరావు, కపిలవాయి రామనాథశాస్త్రి పాడగా విన్నాను. స్టేజిమీద టి.జి. కమల అనబడే కమలా చంద్రబాబు, సినీనటి జమున పాడటం కన్నాను. తెరమీదనే పి. సుశీల, కొద్దిమార్పుతో ఎస్. జానకి నేపథ్యంతో జముననూ, జయలలితనూ ఈ పాట పాడగా చూశాను. జానకి పాటలో మెరుపు మెలికలున్నాయి. సుశీల పాటలో మాధుర్యం, కమల సాధనలో ధీరత్వం, జమునలో ఉత్సాహం, రామనాథశాస్త్రిలో సంగీత సామర్ధ్యం బుజ్జగిస్తాయి, బుదిరిస్తాయి. ఈ పాట తమది చేసుకున్న స్థానం స్థానే సత్య, ముఖ్యంగా ‘వై’ దర్భికి అన్నచోట వెక్కిరింపుతో సహా సాక్షాత్కరిస్తుంది. ఒక్క ఎస్. వరలక్ష్మి పాటలోనే యివన్నీ కలిసి కట్టుగా వుంటాయి. ఈ సినిమాలో ఆమె పాడిన ఏ పాటా రికార్డుకెక్కకపోవడం, ఆ సినిమా యిప్పుడు దొరకకపోవడం దురదృష్టం.”


సాలూరి రాజేశ్వరరావుగారి సంగీతంలో బసవరాజు అప్పారావుగారి సంస్మృతి కార్యక్రమంలో పాడిన ఒక గొప్ప పాట ‘ఆనందమే లేదా’. తరువాత రికార్డుగా వెలువడింది. ఈ పాటను తెలుగు స్వతంత్ర, 1953 ఆగస్టు 21 సంచికలో రజనీకాంతరావుగారు విశ్లేషిస్తూ “ఒకే స్థాయిలో ఒకరు ఒక స్వరమూర్ఛనలో పాడుతుంటే అదే సాహిత్యాన్ని రెండవవారు అవే స్వరాలు కాక, వాటికి సంవాదులైన వేరుస్వరాల మూర్ఛనలో పొదిగిన మట్టులో ఒకేసారి మేళవించి పాడారు. అటువంటి ఫణితి మళ్ళీ రాలేదు. కాని ఆ విధమైన గానంలో పాల్గొనడానికి మంచి ధారణ, స్థైర్యమూ, సునిశితమనస్సూ కావాలి. వరలక్ష్మి కివన్నీ కరతలామలకాలే” అన్నారు.


1940-1955 మధ్య కాలంలో రేడియో సంగీత నాటికల్లోను, గీతావళి కార్యక్రమాల్లోను వరలక్ష్మి గొంతు వినిపిస్తుండేది. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి విద్యాపతి నాటకంలో అనూరాధ పాత్ర ధరించి ‘ఆషాఢం అభిసారిక, ఆత్మేశ్వరుడెవరో’ ఇత్యాదిగా రెండు మూడు గేయాలు పాడినట్లు జ్ఞాపకమని రజనిగారే చెప్పారు.


యాభయవ దశకం మొదటి భాగంలో రేడియోలోనే రికార్డయిన (ఆల్ ఇండియా రేడియో వారి T.S records ద్వారా) ఒక మూడు పాటలు: 1. ఊపరే ఊపరే ఉయ్యాల (సంగీతం: మంగళంపల్లి బాలమురళీకృష్ణ, రచన: వింజమూరి శివరామారావు), 2. గణగణగణ జయగంట, 3. నడిచి నడిచి (మల్లిక్ తో కలిసి). ఇలానే ఇంకో ప్రైవేటు రికార్డుపైన వచ్చిన మరో మంచి పాట [మధురముగా ఈ ప్రశాంత …] గడచిన గాథలు ఏవో నామదిలో …


రజనీకాంతరావు గారే అన్నట్లు “కర్నాటక సంగీతంలోని గాఢ ఫణితులుగాని, హిందుస్తానీ బాణీలోని బిరకాలుగాని, లలిత సంగీతంలోని మధుర ధోరణులుగాని, అశ్రమంగా అతి సహజంగా దొర్లిపోయే కంఠం ఆమెది. [పొందిన] శిక్షణ తాను స్వయంగా సంగీతకచ్చేరీలు చేసేటంతవరకూ రానీక, సినిమాలలోను, రేడియోలలోను లఘుగీతఫణితులు పాడగలగడంతో ఆగిపోయింది. లేకపోతే తెలుగునాటికి ఈమెయే మొదటితరగతి గాయకురాలై ఉండేది.”

Comments

Post a Comment

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!