సాంబారు తెలుగు వాళ్ళదే.-వేసవాసరం; !

సాంబారు తెలుగు వాళ్ళదే.-వేసవాసరం; !

.

సాంబారు తమిళుల సోత్తేమీ కాదు.అది తమిళ పదం అంతకన్నా కాదు.

సాంబారు తెలుగు వాళ్ళదే.

.

యింగువ 5 గ్రాములు,నూరిన అల్లం ముద్ద 10 గ్రాములు, మిరియాలపొడి 20 గ్రాములు, జీలకర్ర పొడి 40 గ్రాములు,

పసుపు కొమ్ములు దంచిన పొడి 80 గ్రాములు, ధనియాల పొడి 160 గ్రాములు ఈ మోతాదులో వరసగా ఒకదానికన్నా ఒకటి రెట్టింపు మోతాదులో తీసుకొని అన్నీ కలిపి ఒక సీసాలో భద్రపరుచుకోవాలి.యిదే 

వేసవాసరం.దీన్ని సాంబారు పొడిగానూ,రసం పొడిగానూ,కూరపోదిగానూ వాడుకోవచ్చు.

'వేసవాసరం' పేగుల్ని బలసంపన్నం చేస్తుంది.శరీరం లో విషదోషాలు ఏర్పడకుండా యాంటీ ఆక్సిడెంట్ 

ఏజెంట్ గా పని చేస్తుంది.కేన్సర్ లాంటి వ్యాదులనుంచి సరక్షిస్తుంది.ఎలర్జీ,స్థూలకాయం, మధుమేహం,

రక్తపోటు లకు సహకార ఔషధం గా పని చేస్తుంది.దీన్ని కూరలు,పప్పులు,పులుసులు,పచ్చళ్ళ లోనూ 

కలిపి వాడుకోవచ్చు.యిందులో మిరపకారం,ఉప్పు, చింతపండు,వెల్లుల్లి, లాంటి ద్రవ్యాలు లేవు.వాటిని రుచి కొద్దీ అదనంగా పరిమితంగా కలుపుకోవచ్చు.గ్లాసు మజ్జిగలో అరచెంచా పొడిని కలిపి రోజూ తాగితే జీర్ణశక్తి పదిలంగా వుంటుంది.

రకరకాల సాంబారు రుచులు

ఒక కప్పు బియ్యం,అరకప్పు పెసరపప్పు కలిపి, ఉడకబెట్టి 14 రెట్లు నీళ్ళు కలిపి వేసవాసరం,తగినంత ఉప్పు కలిపి తాలింపు పెట్టిన సాంబారుని 'అష్టగుణమండం'' అంటారు.యిందులో చింతపండు,దానిమ్మ లాంటి పులుపు పదార్థాలు తగు మాత్రంగా కలుపుకోవచ్చు.జ్వరము వచ్చినప్పుడు పథ్యంగా పెట్టదగిన వంటకం.ఆకలిని నిలబెడుతుంది,ఔషధానికి సహకరించి వ్యాధి త్వరగా తగ్గడానికి తోడ్పడుతుంది.అజీర్తి,గ్యాసు,ఉబ్బరం వున్నవాళ్ళు దీన్ని సూపు లాగా తాగవచ్చు.సాంబారు,రసం కూడా సూపు లాంటివే.'యోగారత్నాకరం' లో దీన్ని భోజనసారం అనీ సారంగలోచన లాంటి స్త్రీ అధరామృతం లా 

రుచికరమైన్ది అని వర్ణించారు.చిన్తపండుకి 16 రెట్లు నీళ్ళు పోసి అందులో 'వేసవాసరం' తగినంతవేసి బాగా మరిగేలా కాచిన చారు వాతాన్నీ,కఫాన్నీ తగ్గిస్తుంది, ఆకలిని కలిగిస్తుంది,భుక్తాయాసం లేకుండా చేస్తుంది.

వెలగ,టమాటా లతో కూడా చారు చేసుకోవచ్చు.చింతపండు వేయకుండా కాచిన సాంబారుని 'యూషం'

అంటారు.పెసరపప్పు,కందిపప్పు,ఉలవలు,శనగ పప్పు రకరకాల ధాన్యాలతో (ఏదైనా ఒకదానితో)

దీన్ని కాచుకోవచ్చు.వాటిలో పెసరకట్టు తో చేసినడి (యుద్గయూషం)ఎక్కువ ఆరోగ్యదాయకం.వాతవ్యాదులన్నింటికీ యిది మేలు చేస్తుంది.తేలికగా అరుగుతుంది.సూపులాగా త్రాగవచ్చు అన్నం లో కలుపుకొని తినవచ్చు.

ఉలవచారుని 'కుళుత్థ యూషం' అంటారు.దీని తయారీలో తెలువాళ్ళు ప్రసిద్ధులు.'వేసవాసరం' తగినంతవేసి కాచిన ఉలవచారు స్థూలకాయంతగ్గటానికి ,రక్తం లో కొవ్వు,తగ్గించటానికి,మూత్రపిండా వ్యాదులకూ మంచి ఔషధం గా పనిచేస్తుంది.

సాంబారు తమిళుల సోత్తేమీ కాదు.అది తమిళ పదం అంతకన్నా కాదు.సాంబారు తెలుగు వాళ్ళదే.

అన్నం లో ఆఖరున ద్రవపదార్థాలు తినాలనే ఆయుర్వేద సూత్రాన్ని అనుసరించే విధంగా సాంబారు,చారు,మజ్జిగన్నం తింటున్నాం.

మాతృహీన శిశు జీవనం వృథా 

కాంతహీన నవయవ్వనం వృథా 

శాంతి హీన తపసః ఫలం వృథా 

తింత్రిణీ ఫల రస హీన భోజనం

అర్థము:--తల్లి లేని శిశు జీవనం కష్టమైనది,భార్యలేని యౌవ్వనం వృథా,శాంతం లేకుంటే తపస్సు చేసిన ఫలం వృథా,చారులేని భోజనం కూడా వృథా 

తీపి,పులుపు,ఉప్పు,కారం,వగరు,చేదు ఈ ఆరు రుచులతో కూడిన భోజనమే శ్రేష్ఠ మైనది.రాను రాను వగరు,చేదు తినేవారి సంఖ్య తగ్గిపోతూ వుంది.పులుపు,కారాలకోసం చింతపండునీ,అల్లం వెల్లుల్లి మిశ్రమాలనీ మోతాదుకు మించి వాడడం వల్ల "అపకారం జాస్తి,ఆరోగ్యం నాస్తి " అవుతుంది.ఈ రెండింటినీ సరి చేసుకుంటే మనదే ఉత్తమ మైన భోజనం అవుతుంది.'వేసవాసరం' వాడుకుంటే అన్ని సమస్యలూ పరిష్కారం అవుతాయి


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!