🙏పరమశివుని నివాసం వారణాసీ పురం 🙏

🙏పరమశివుని నివాసం వారణాసీ పురం 🙏


👉నగరవాసం మీద తనకేమాత్రం మోజులేనప్పటికీ, 

సుకుమారంగా పెరిగిన సతీదేవి తనతోపాటు కొండల్లో - కోనల్లోను, మేఘాల మీదను విహరింపవలసి రావడం పరమశివునికీ 

బాధ కలిగించేదిగానే వుంది.

.

👉నివాసానికి అనుకూలమైన ప్రదేశం కోసం లోకాలన్నీ పరికించి చూశాడు. భూలోకంలో గంగానది ఒడ్డున ఉన్న వారణాసీ పురాన్ని, తాను ఇంతకుముందే చూసివున్నాడు. బాగా యోచించి అదే తన నివాస స్థానంగా చేసుకోవాలని భావించాడు.


👉వెంటనే, అక్కడున్న నికుంభుడనే గణనాయకుని పిలిచి, వారణాసీ వాటికలో ఎలాంటి అకృత్యాలూ చేయకుండా, ఆ పురాన్ని ప్రజలచేత ఖాళీ చేయించమన్నాడు.


👉అప్పుడక్కడ దివోదాసుడనే ధర్మప్రభువు రాజ్యం చేస్తున్నందున శివుడలా ఆనతిచ్చి ఉన్నాడు. శివదీక్షాపరుడైన మంకణుని సాయం తీసుకుని నికుంభుడు నేర్పుగా ఖాళీ చేయించాడు ఆ పట్టణాన్ని.

.

👉అలా ఖాళీ అయిన ఆ నగరాన్ని స్వర్గంతో తులతూగేలా - వాసయోగ్యంగా నిర్మించి ఇవ్వమని శంకరుడు పరమాత్ముని ధ్యానించాడు.


👉సంకల్పమాత్రాన అది అపురూప నగరిగా రూపాంతరం చెందింది. సతీ సమేతుడై శంకరుడానగరిలో చిరకాలం సుఖించాడు.


🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!