🌹రాజశ్రీ - ఇందుకూరి రామకృష్ణంరాజు🌹


🌹రాజశ్రీ - ఇందుకూరి రామకృష్ణంరాజు🌹



రాజశ్రీ తెలుగు సినిమాలలో అనువాద రచనలో ప్రముఖులు. వీరు ఆగష్టు 31, 1934 సంవత్సరం విజయనగరంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు ఇందుకూరి అప్పలరాజు, నారాయణమ్మ. వీరు విజయనగరం మహారాజా కళాశాల నుంచి బి.ఎస్సీ. పట్టా పొందారు. వీరు తొలినుంచి నాటక సాహిత్యాభిలాషి. వీరి 'వదిన', 'ఆంధ్రశ్రీ' నాటకాలు రాఘవ స్మారక కళాపరిషత్తులో ఉత్తమ రచనలుగా ఎన్నుకోబడ్డాయి. విశాఖ జిల్లా బోర్డు కార్యాలయంలో స్టెనో టైపిస్టుగా కొంతకాలం పనిచేశారు. చలనచిత్ర రంగానికి తరలి వెళ్ళి పినిశెట్టి శ్రీరామమూర్తి, మానాపురం అప్పారావు వద్ద సహాయ దర్శకునిగా చేరారు. తరువాత తమిళ చిత్రసీమ వీరిని కథకునిగా పరిచయం చేసింది.


రాజశ్రీ (సినీ రచయిత)


ఈయన ఎక్కువగా అనువాద చిత్రాలకు మాటలు మరియు పాటలు రాసాడు. బి.యస్సీ ఫిజిక్సు చేసి ఆ తర్వాత రెండు మూడేళ్ళు విజయనగరం తహసిల్దారు వద్ద పి.ఏ. గా చేసి, అక్కడ నచ్చక మద్రాసు వెళ్ళిపోయారు. అక్కడ ఎం.జి.ఆర్. ని కలిసి ఆయన కోసం రాసిన ఒక కథను వినిపించారు. అది ఎం.జి.ఆర్. గారికి నచ్చడంతో "తేడివంద మాప్పిళ్ళ"పేరుతో సినిమా తీయబడినది. అది విజయవంతం అయ్యింది. ఆ తర్వాత దాదాపు 10 వరకు తమిళ చిత్రాలకి కథ, స్క్రీన్ ప్లే అందించారు. సుమారు 1000 చిత్రాలకు రచన చేసారు. అంతే కాకుండా ఎం‌కన్న బాబు, మామా కోడలు, పెళ్ళిచేసి చూపిస్తాం మరియు "పుదియ సంగమం" అనే తమిళ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు. చదువు సంస్కారం, నిజం నిద్రపోదు (1976), ఓ ప్రేమ కథ (1987) చిత్రాలకు దర్శకత్వం వహించారు. మణిరత్నం తెలుగులో నేరుగా దర్శకత్వం వహించిన ఒకే ఒక చిత్రం గీతాంజలికి మాటలు రాసారు. మట్టిలో మాణిక్యం, బంగారు గాజులు చిత్రాలకు బంగారు నంది పురస్కారాలు అందుకున్నారు. రాజశ్రీ రచన చేసిన చివరి చిత్రం ప్రేమికుడు. 1994 ఆగస్టు 14 న నిదురలోనే మరణించాడు.


కొన్ని ముఖ్యమైన చిత్రాలు !

శ్రీ సింహాచల క్షేత్ర మహిమ (1965)

పెళ్ళి రోజు (1968) (గీతరచన)

బంగారు గాజులు (1968) (కథా రచన)

సత్తెకాలపు సత్తెయ్య (1969)

సంబరాల రాంబాబు (1970)

మట్టిలో మాణిక్యం (1971)

బుల్లెమ్మ బుల్లోడు (1971) (గీతరచన)

దేవుడమ్మ (1973)

తులాభారం (1974)

చదువు సంస్కారం (1975) (కథ, మాటలు, పాటలు, చిత్రానువాదం, దర్శకత్వం)

స్వయంవరం (1982)

ఖైదీ (1983)

ప్రేమసాగరం (1983) (అనువాదం - తమిళం)

మౌన రాగం (1986) (అనువాదం - తమిళం)

నాయకుడు (1987) (అనువాదం - తమిళం)

విచిత్ర సోదరులు (1989) (అనువాదం - తమిళం)

ప్రేమ పావురాలు (1989) (అనువాదం - హిందీ)

గీతాంజలి (1989)

దళపతి (1992) (అనువాదం - తమిళం)

జంటిల్ మేన్ (1993) (అనువాదం - తమిళం)

ప్రేమికుడు (1994) (అనువాదం - తమిళం)

మైఖేల్ మదనకామరాజు (అనువాదం - తమిళం)

ఘర్షణ (పాతది) (అనువాదం - తమిళం)

వైశాలి ( అనువాదం- మళయాళం)

ఆడదాని అదృష్టం (మాటలు)

పరువు ప్రతిష్ట

కన్నవారి కలలు

బంగారు గాజులు


కొన్ని ఆణిముత్యాలు

కురిసింది వాన నా గుండెలోన... - బుల్లెమ్మ బుల్లోడు

యమునాతీరాన రాధ మదిలోన... - గౌరవం-అనువాదం

సింహాచలము మహా పుణ్య క్షేత్రము... - సింహాచల క్షేత్రమహిమ

మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట... - మట్టిలో మాణిక్యం

నన్ను ఎవరో తాకిరి, కన్ను ఎవరో కలిపిరి... సత్తెకాలపు సత్తెయ్య

మామా చందమామ విన రావా... సంబరాల రాంబాబు

ఎక్కడో దూరాన కూర్చున్నావు... దేవుడమ్మ

నిన్ను తలచి మైమరచా... - విచిత్ర సోదరులు

మధువొలకబొసె ఈ ఛిలిపి కళ్ళు- కన్నవారి కలలు

రాధకు నీవేర ప్రానం - తులాభారం

నీ నీడగా నన్ను కదలాడనీ

ఇదే నా మొదటి ప్రేమ లేఖ -స్వప్న

ఒకే కులం ఒకే మతం అందరు ఒకటే -మాదైవం

ఇది పాట కానే కాదు-తలంబ్రాలు

సేకరణ - వింజమూరి .

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!