శ్రీకృష్ణ శతకం🌹 (రోజుకు ఒక పద్యం 231118)


శ్రీకృష్ణ శతకం🌹

(రోజుకు ఒక పద్యం 231118)


🏵️


శక్రసుతు గాచుకొఱకై

చక్రము చేపట్టి భీష్ము జంపఁగ జను నీ

విక్రమ మేమని పొగడుదు

నక్రగ్రహ సర్వలోక నాయక కృష్ణా!


🏵️


భావం:

కృష్ణా! అర్జునుడు, భీష్ముడు యుద్ధం చేస్తున్న సమయంలో భీష్ముని ధాటికి తాళలేకపోతున్న అర్జునుడిని రక్షించడానికి నువ్వు చేతిలో చక్రాయుధాన్ని ధరించి పరాక్రమాన్ని ప్రదర్శించావు. అటువంటి నిన్ను వర్ణించటం ఎవరితరమూ కాదు.


కురుక్షేత్ర యుద్ధంలో ఎట్టిపరిస్థితుల్లోనూ ఆయుధం ముట్టుకోనని చెప్పిన శ్రీకృష్ణుడు తనకు ఇష్టుడైన అర్జునుడిని రక్షించడం కోసమని రథం మీద నుంచి ఒక్క దూకు దూకి చక్రాయుధాన్ని చే తబట్టి భీష్ముడి మీదకు బయలుదేరతాడు. 

అర్జునుడి మీద ఉన్న ప్రేమతో తన మాట తానే మర్చిపోయాడు. 

కృష్ణునికి అర్జునుడంటే అంత ప్రీతి. ఆ విషయాన్ని కవి ఈ పద్యంలో వివరించాడు.


🙏🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!