అల్లసాని పెద్దన చాటువులు


పెద్దన చాటువులు


కావ్యాలు రాయటానికి పెద్దనకి ఇవన్నీ కావాలట

నిరుపహతిస్థలంబు రమణీ ప్రియ దూతిక తెచ్చి ఇచ్చు క

ప్పుర విడె మాత్మ కింపయిన భోజన మూయల మంచ మొప్పు త

ప్పరయు రసజ్ఞులూహ తెలియంగల లేఖక పాఠకోత్తముల్

దొరకిన గాక యూరక కృతుల్ రచియింపుమటన్న శక్యమే ?!


రాయల మరణానంతరము చెప్పిన పద్యాలు

ఎదురైనచోఁ తన మద కరీంద్రము డిగ్గి 

  కేలూఁత యొసఁగి యెక్కించుకొనియె

కోకట గ్రామాద్యనేకాగ్రహారంబు

లడిగిన సీమల యందు నిచ్చె

మను చరిత్రం బందుకొను వేళఁ పురమేగ

పల్లకి తన కేలఁ బట్టి యెత్తె

బిరుదైన కవి గండ పెండేరమున కీవ 

  తగుదని తానె పాదమునఁ తొడిగె


ఆంధ్ర కవితా పితామహ! అల్లసాని

పెద్దన కవీంద్ర యని నన్నుఁ బిలుచునట్టి

కృష్ణరాయలతో దివికేఁగ లేక

బ్రతికి యున్నాఁడ జీవాచ్ఛవంబ నగుచు!



"కృష్ణ రాయల నిర్యాణా నంతరము కళింగ పాలకుడగు గజపతి

కన్నడ రాజ్యము పైకి దండెత్తి రాగా పెద్దన క్రింది సీస పద్యమును 

విరచించి పంపెననియు, దానిని చదువుకొని యాతడు సిగ్గిలి మరలి 

పోయె ననియు నొక యైతిహ్యము ప్రచారములో గలదు"

రాయ రావుతు గండా  రాచ యేనుఁగు వచ్చి

      యారట్ల కోటఁ  గోరాడు నాఁడు

సంపెట నర పాల సార్వ భౌముఁడు వచ్చి

      సింహాద్రి జయశీలఁ జేర్చు నాఁడు

సెల గోలు  సింహంబు చేరి ధిక్కృతిఁ గాంచు

      తల్పులఁ గరుల  డికొల్పునాఁడు

ఘనతర నిర్భర గండ పెండర మిచ్చి

      కూఁతు రాయని కొనగూర్చు నాఁడు


నొడ లెఱుంగక సచ్చితో? యుర్వి లేవొ?

చేరఁ జాలక తల చెడి జీర్ణ మైతొ?

కన్నడం   బెట్లు సొచ్చెదు? గజపతీంద్ర?

తెఱచి నిలు  కుక్క సొచ్చిన తెఱఁగు దోఁప.




(తెనాలి రామకృష్ణుడి విమర్శకు పాలైన "అమవస నిశి" పద్యం)

కలనాటి ధనము లక్కర

గలనాటికి దాచ కమల గర్భుని వశమా

నెల నడిమి నాటి వెన్నెల

యలవడునే గాదె బోయె నమవస నిశికిన్.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!