మరిన్ని ముళ్ళపూడి వారి జోకులు .!

ముళ్ళపూడి

మరిన్ని ముళ్ళపూడి వారి జోకులు .!

ఒక పెద్దమనుషి డాక్టరు దగ్గరకు వెళ్ళాడు.

"రోగం ఫలానా అని చెప్పలేనుగానీ ... ఏమిటో ఎప్పుడు చెవులు హోరెత్తిపోతూ ఉంటాయండి. ఇంట్లో ఇంత చిన్న చప్పుడయినా అదిరిపడతాను. జుట్టు నెరవకపోయినా భగవద్గీత చదవాలనిపిస్తుంది. రాత్రిళ్ళు నిద్దర పట్టదు. విసుగు ... చిరాకు .. భయం ... కంగారు ... త్రోటుపాటు ఎక్కువైపోయింది ..."

" అవునవును. తెలుసు. నాకూ పెళ్ళయింది లెండి" ... అన్నాడు డాక్టరు సానుభూతి ప్రకటిస్తు.

ఎదుగుబొదుగు లేని వేమిటని అడిగారు మాష్టారు

"తెలుగు సినిమా" అన్నాడు ఎడిటరు గారబ్బాయి.

"నీ జీతం నాన్న" అన్నాడు సుపుత్రుడు.

"వడ్డి లేని అప్పు" అన్నాడు సెట్టిగారబ్బాయి.

"సినిమాతార వయసు" అన్నాడు ఎదుగుతున్న బిడ్డడు.

"గొర్రెతోక" అన్నాడు ఎదుగూ బొదుగూ లేని విద్యార్థి.

"సరే నీ బుర్రకూడా వొకటనుకో" అన్నాడు మాష్టారు.

..........................

తలా తోకా లేనివి : తెలుగు సినిమా కథ, ఎన్నికల వాగ్దానాలు

................

"ఈపూట మీ ఇంట్లో కూరేం చేసారూ?"

"ఏంచేస్తాం, తిన్నాం" 

స్త్రీల కాలమానం దేవతల కాలమానానికి దగ్గరగా ఉంటుంది - ముఖ్యంగా అలంకరణ విషయంలో. సినిమాకి వెళ్ళేముందు - ఒక మాములు క్షణం ఒక పురుషయుగం. అలాటి పురుషయుగాలు రెండు కోట్లు కలిస్తే ఒక స్త్రీనిముషం. అలాటి నిముషాలు నూటయాభై అయితే ఒక చీర సింగారింపు. నూరు చీరసింగారింపులు ఒక పోడరు కోటా. నూరుకోటాలకాలం ఒక తిలక ధారణ. నూరు తిలకాలు కలిస్తే ఒక దర్పణప్రతిబింబ పర్యవేక్షణ.

.... ముళ్ళఫూడి

1954 లో వచ్చిన ' వద్దంటే పెళ్లి ' చిత్రం మీద సమీక్ష రాస్తూ ముళ్ళపూడివారు .................

" ఈ చిత్రం నిడివి మూడు మైళ్ళ ఐదు ఫర్లాంగుల తొమ్మిది గజాలు లేదా మూడు గంటల ముఫ్ఫై ఏడు నిముషాల పదిన్నర సెకన్లు " అంటూనే ................

" రెండో ఆటకి పిల్లాజెళ్ళతో వెళ్ళేవాళ్లు పకోడీలు, జంతికలూ వగైరా చేసుకుని రెండు మరచేంబులతో మంచినీళ్ళు పట్టుకుని మరీ వెళ్ళడం మంచిది " అని సలహా కూడా ఇస్తారు

.

 

ఈ ముళ్ళపూడి జోకులకు expiry date లేదు!!! :lol:
@ " మీ పిక్చర్ కామెడియా? ట్రాజెడీయా?'
"డబ్బొస్తే కామెడి, రాకపోతే ట్రాజెడీ".
@"నేడే చూడండి" అని ప్రతి సినిమా ప్రకటనలో వేస్తారు కదా! అంత కొంప మునిగిపోయే అర్జంటేమిటి?"
"రేపుండదని హెచ్చరిక" అన్నాడు నాడే సినిమా చూసొచ్చిన ప్రేక్షకుడు.
ఈ కాన్సెప్ట్ కు మోడర్న్ అవతార్స్....టీ వీ లలో సక్సెస్స్ మీట్స్!!! :lol:

@"ప్రపంచమే ఒక నాటక రంగమైతే? మనమంతా కాస్త రిహార్సల్ చేసుకు మరీ మాటాడటం మంచిది." అన్నాడు ఒక నట సామ్రాట్.
@"సెన్సారాఫీసర్లు చేసే పనేమిటండీ"?
" ఆ ఏముందీ. సినిమాల్లో ప్రతి మాటకీ రెండర్ధాలు వెదకడం."
@కమల: ఈ మగవాళ్ళు వాళ్ళల్లో వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో?
విమల: ఆడవాళ్ళు మాట్టాడుకునేవే మాట్లాడుతారనుకుంటా."
కమల: చి చి అసయ్యం.
@"రేపు ఎలక్షనుకు నిలబడే అభ్యర్దులిద్దరి గురించి నీ అభిప్రాయం ఏమిటోయ్?"
" ఇద్దర్లో ఎవడో ఒకడే గెలుస్తాడని ఆనందంగా ఉన్నది."
@"నాతో నేనే మాట్లాడుకోడం మహా అలవాటైపోయింది డాక్టర్ గారూ. కాస్త మందేమైనా ఇస్తే-"
"దాంతో ఇబ్బందేముంటుంది? మందెందుకు?"
" అబ్బే వెధవ సోదండీ . విసుగొస్తుంది వాగాలేకా-వినాలేకా".
@"ఏమండీ, ఈ కవర్ మీద పది పైసలు స్టాంపులు ఎక్కువ అంటించారు.'
" అయ్యో చూడు నాయనా. అది రాజమండ్రిదాకానే వెళ్ళాలి. బిళ్ళలెక్కువున్నాయని విశాఖపట్నం లో మా వియ్యపురాలింటికి తోలీకుండా చూడు."
@"ఇక లాభం లేదు, ఓ గంటకన్న ప్రాణం నిలబడదు. చెప్పదలుచుకున్నదేమన్నా ఉంటే ఇప్పుడే చెప్పండి" అని డాక్టర్ పెదవి విరిచాడు.
"ఆ ఉంది...ఇంకో డాక్టర్ను పిలిపించండి చప్పున" న్నాడు రోగి నీరసంగా.
@"డాక్టర్ గారూ.భోజనానికి సరైన వేళాపాళా ఏదంటారూ ?"
"లేనివాడికి దొరికినప్పుడు...ఉన్నవాడికి అరిగినప్పుడు"
@ ఒక రోగి ఆ"పరేషన్" బల్ల ఎక్కుతూ
"మరే ప్రమాదం లేదుగా డాక్టర్ గారూ?"
"చాల్చాల్లెవయ్యా, నవ్విపోతారు, నువ్విచ్చే డబ్బుకి ప్రమాదకరమైన ఆపరేషన్ ఎవడు చేస్తాడు. భలేవాడివిలే"

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!