కస్తూరి శివరావు


కస్తూరి శివరావు గారు  నిర్మించి దర్శకత్వం వహించిన ' పరమానందయ్య శిష్యుల కథ ' చిత్రం నిర్మాణ దశలో వుండగా జరిగిన ఓ తమాషా సంఘటన. ఓ రోజు ఓ సన్నివేశంలో నటించడానికి గాడిద కావాల్సి వచ్చింది. సరే .... గాడిదను తీసుకొచ్చారు. సరిగ్గా ' టేక్ ' చేసే సమయానికి ఆది కాస్తా హాయిగా పడుకుంది. దాని శిక్షకుడు ఎన్ని రకాల ప్రయత్నించినా లేవలేదు. యూనిట్ లోని వారందరూ కూడా తమ యథాశక్తి దాన్ని లేపడానికి ప్రయత్నించారు. ఫలితం శూన్యం. చివరగా కస్తూరి శివరావు గారు లేచి దాని దగ్గరకు వెళ్ళి చెవిలో ఏదో చెప్పారు. అంతే ... ఆది వెంటనే చెంగున లేచి కూర్చుంది. అందరికీ ఆశ్చర్యమేసింది. గాడిద చెవిలో ఏం చెప్పారని శివరావు గారిని అడిగారు. దానికాయన

" నేనేం ప్రత్యేకంగా చెప్పలేదు. ' లే బాబూ ! నీకు పుణ్యముంటుంది ' అన్నానంతే ! దానిక్కూడా డబ్బులిచ్చేది నేనేనని తెలిసిపోయినట్లుంది. అందుకే నా మాట విని లేచింది " అన్నారు.   


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!