బొమ్మలకొలువు.

బొమ్మలకొలువు.

సర్వసాధారణంగా పిల్లల ఆనందం, ఉత్సాహాల కోసం తీర్చిదిద్దే దీనినే దసరా బొమ్మల కొలువు అని కూడా అంటారు. దసరా నవరాత్రులలో పది రోజులు (9 రాత్రులు)ఈ సరదా బొమ్మలకొలువు పండగ జరుపుకుంటారు. దుర్గాదేవి రాక్షస విజయానికి గుర్తుగా ఈ పండగ జరుగుతుంది. దీని అలంకరణకు తొమ్మిది మెట్లుంటాయి. వారి కళాదృష్టి, ఆర్ధిక స్తోమత, సౌకర్యాలను బట్టి వాళ్ళు ఈ మెట్లపై రకరకాల బొమ్మలను అమరుస్తారు.

దీప ధూప నైవేద్యాలతో ప్రతిరోజూ లలితా సహస్రనామాలు, లక్ష్మీ అష్టోత్తరం చదివి పూజలు చేస్తారు. రోజూ ఒక కన్య కి (చిన్నఅమ్మాయి), ఒక సువాసినికి భొజనము పెట్టి తాంబూలం, అలంకరణ వస్తువులు, బట్టలు ఇస్తారు. ఇలా దసరా తొమ్మిది రోజులు చేస్తారు. ప్రతి రోజూ సాయంత్రము పేరంటానికి ముత్తైదువులను, పిల్లలను పిలిచి, అందరికీ పసుపు - కుంకుమ, తాంబూలము, దక్షిణ ఇస్తే తమకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని, అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని నమ్ముతారు. ఆ సమయములో మగువలంతా ఇచ్చుపుచ్చుకొనే కుంకుమ ఇల్లాలి సౌభాగ్యానికి చిహ్నము. అష్టగంధము, పసుపు ఆరోగ్యానికి చిహ్నాలు. మహిషాసురుణ్ణి చంపేందుకు దేవి కొంతకాలము సూది మొన మీద తపస్సు చేసిందంటారు. అందుకని బొమ్మల కొలువున్నన్ని రోజులు సూదిలో దారము పెట్టి ఏపని చెయ్యరు. ఈ బొమ్మలకొలువు ప్రతి సంవత్సరము చేస్తారు. కొన్ని ప్రాంతాలలో సంక్రాంతి కి బొమ్మల కొలువు పెడతారు. బొమ్మలు అమర్చే పద్ధతి మాత్రం ఇదే. బొమ్మల కొలువు పెట్టడం మొదలు పెట్టాక సంవత్సరానికో మెట్టు చొప్పున తొమ్మిది మెట్ల వరకు పెంచుతూ వెళతారు. ప్రతీ సంవత్సరము తప్పనిసరిగా ఓ క్రొత్త బొమ్మ కొనడం సంప్రదాయం. ప్రస్తుతం ప్లాస్టిక్ బొమ్మలు, బార్బీలు చోటు చేసుకున్నాయి కానీ ఒకప్పుడు మట్టి బొమ్మలు, పింగాణీ బొమ్మలు మాత్రమే ఉండేవి.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!