శ్రీకాళహస్తీశ్వర శతకము.!...................(.ధూర్జటి.).21/4/15.

శ్రీకాళహస్తీశ్వర శతకము.!...................(.ధూర్జటి.).21/4/15.

.

ఏ వేదంబు పఠించెలూత,భుజగం బే శాస్త్రముల్సూచె దా

నే విద్యాభ్యసనం బొనర్చెగరి,చెం చేమంత్రమూహించె, బో

ధావిర్భావ నిధానముల్ చదువుల య్యా? కావు,మీ పాదసం

సేవాసక్తియె కాక జంతుతతికిన్ శ్రీకాళాహస్తీశ్వరా!

.

శ్రీకాళాహస్తీశ్వరా!నిన్ను కొల్చిన సాలెపురుగు ఏ వేదమును చదువలేదు

.నిన్ను పూజించిన సర్పము ఏ శాస్త్రమును అభ్యసింపలేదు

.నిన్ను భుజించిన ఏనుగు ఏ విద్యను నేర్వలేదు.

బోయవాడైన తిన్నడు ఏ మంత్రమును నిన్ను అర్చించుటకై నేర్చుకొనలేదు

.నీ పూజ చేయవలెనను జ్ఞాన్ము పొందుటకు సమస్త ప్రాణులకు

ఏ చదువులు అక్కరలేదు.

కేవలము నీ పాదములను అర్చించవలెనను కోరికయే అందుకు మూలకారణము.

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !