విద్యా ధన బలముల ప్రభావము:-

విద్యా ధన బలముల ప్రభావము:-

.

విద్యా ధన బలములను మంచి కొరకు ఉపయోగించుకొనువాడు సజ్జనుడు. 

వీటిని అకారణ వివాదములకు, గర్వ పడుటకు , ఇతరులను బాధ పెట్టుతకూ ఉపయోగించుకొనువాడు దుర్జనుడు. 

మనం అపు రూపమయిన పై మూడూ పొంద గలిగితే తప్పక మంచి కొరకే, 

పరుల కుపకారము చేయుట కొరకే ఉపయోగించి సజ్జనుల జాబితాలో చేరుదామా మరి!

.

.

శ్లో:-

విద్యా వివాదాయ ధనం మదాయ

శక్తిః పరేషాం ఖలు పీడనాయ.

ఖలస్య సాధోః విపరీతమేతత్

జ్ఞానాయ దానాయచ రక్షణాయ.

.

చ:-

వరలెడి విద్య మూర్ఖపు వివాదపు ప్రౌఢిమ, విత్తమున్ మదం

బరయగ శక్తి నన్యులను బాధలు పెట్టుగ మూర్ఖు లందునన్,

పరులకు జ్ఞానమున్ గొలుప, భక్తిని పంచగ పేదవారికిన్

సరగున రక్ష సేయగను సజ్జనులందున నొప్పు నెల్లెడన్.

.

భావము:-

.

విద్య, ధనము, బలము అను యీ మూడూ మూర్ఖులందు వివాదము కొరకును, గర్వ పడుటకును, పరులను హింసించుటకునూ ఉపయోగ పడుచుండగా, సజ్జనులయందు ఇతరులకు జ్ఞాన బోధ కలిగించుటకు, పేదలకు కష్టములలో సహాయము చేయుట కొరకూ, బాధలలో నున్న వారిని రక్షించుట కొరకునూ

ఉపయోగ పడుచున్నది కదా!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!