'అస్తి, కస్చిత్, వాక్'
'అస్తి, కస్చిత్, వాక్'
.
కాళిదాసు గురించి నేను చిన్నప్పుడు విన్న ఒక విషయం చెప్పాలి. అమ్మవారి కటాక్షం లభించడానికి ముందు కాళిదాసు అమయాకంగా ఉండేవాడట. అక్కినేని నటించిన కాళిదాసు సినిమాలో కూడా అదే చూపించారు.
ఆ రోజుల్లో ఒక ఊరి పడచు అతన్ని చూసి అస్తి కస్చిత్ వాక్ విశేషః? అని అన్నదట.
అంటే "అసలు నీకు కొంచెమైనా మాట్లాడగలిగే విషయం ఉందా" అని.
.
కొన్నాళ్ళకు అమ్మవారి కరుణతో గతం అంతా మర్చిపోయి మహాకవి అయిపోయాడని
.
ఐతిహ్యం. గతం మర్చిపోయినా కాని 'అస్తి, కస్చిత్, వాక్' అనే ఆ పడచు పలికిన ఆ మూడు
.
పదాలు మస్తిష్కంలో ఉండిపోయాయట. ఆ పదాలు అలా ఎందుకు తలలో ఆడుతున్నాయో
.
తెలియలేదట.
ఏదైతెనేం..ఆ మూడు పదాలతో మూడు కావ్యాలు మొదలెట్టేసి రాసేసాడు.
.
Comments
Post a Comment