శ్రీకాళహస్తీశ్వర శతకము.!.........ధూర్జటి....(27/4/15.)

శ్రీకాళహస్తీశ్వర శతకము.!.........ధూర్జటి....(27/4/15.)

.

రాజై దుష్కృతిచెందె చందురుడు,రా రాజై కుబేరుండు దృ

గ్రాజీవంబునగాంచె దుఃఖము,కురు క్ష్మాపాలుడామాటనే

యాజింగూలె సమస్త రాజబందువులతో .నారాజశబ్దంబు ఛీ, 

ఛీ!జన్మాంతరమందు నొల్లను జుమీ .శ్రీకాళాహస్తీశ్వరా!

.

శ్రీకాళాహస్తీశ్వరా!

రాజైన చంద్రునకు కళంకమేర్పడినది

.

.రాజుగా దనాదిపతియైన కుబేరునకు దేహము చెడిపోయి దుఃఖించినాడు.

.

రారాజైన దుర్యోదనుడు యుద్దమునందు బందువులతో కూడ నాశనము చేశాడు.

.

కావున ఛీ ఛీ నేను ఈ జన్మలోనే కాదు వచ్చే జన్మలో కూడా 

.

'రాజు'అనే పదాన్నే ఒప్పకొనను.

.

నీ పాదముల సేవయే నాకు రాజ్య పదవి కంటే మిన్న.

x

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!