పోతన గారి భాగవత పద్యాలు.!

.
.
పోతన గారి భాగవత పద్యాలు.!
.
అడిగెద నని కడు వడి జను
అడిగిన తన మగుడ నుడువడనినెడ యుడుగున్
...
వెడ వెడ జిడి ముడి తడబడ
నడుగిడు నడిగిడదు జడిమ నడుగిడు నెడలన్
.

” ఎక్కడికి వెడుతున్నారు తమరు ” అని అడగాలనే కోరికతో ఒక అడుగు ముందుకు జరిపింది . అడగవచ్చునో అడగకూడదో అన్న సందింగ్ధంలో పడిపోయింది
. ముందు జరిగిన పాదం వెనుకకు వేసింది .అడిగితే చెబుతాడో లేదో అనే సందేహం . మళ్ళీ ముందు అడుగు వేసింది . వేసిన అడుగు వెనుకబడింది . చిన్నపదాలతో లక్ష్మీ మాత మనస్సులో నెలకొనియున్న సందిగ్ధస్థితిని చక్కగా మనదృష్టికి తీసుకొని వచ్చాడు పోతన్న .
పద్యం అర్థం కాకున్నా , తెలుగు భాష రాకున్నా , ఈ పద్యం విన్నవాడికి సందిగ్ధస్థితి నెలకొని ఉన్నదని అర్థమవుతుంది .
.
శిల్పమంటే ఇదేనేమో ? ఇది సామాన్యమైన కళ కాదు . పోతనకే సాధ్యం . అందుకే అన్నాడో కవి ” ముద్దులు గార భాగవతమున్ రచియించుచు మధ్య మధ్య పంచదారలో నద్దితి వేమొ మహా కవి శేఖర , మధ్య మధ్య అట్లద్దక ఈ మధుర భావములెచ్చటనుండి వచ్చురా మహా కవీ” అని . మహాలక్ష్మి మనో భావాలకు దర్పణంగా నిలిచే ఈ పద్యం ఆంధ్ర సాహిత్యానికే అలంకారం , అపురూపం , అనితర సాధ్యం .

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!