ఆరుద్ర - కూనలమ్మ పదాలు
ఆరుద్ర - కూనలమ్మ పదాలు . ‘ఓ కూనలమ్మా' అనే చివరి పదంతో ముగిసే చిన్న చిన్న పద్యాలైన “కూనలమ్మ పదాలు”, అనే చిన్ని చిన్ని మాటల ఈటెల "ఆరుద్ర కూనలమ్మ పదాలు" ఆంధ్ర దేశాన్ని ఉర్రూతలూగించాయి. కవిత్వాన్ని కొత్త పుంతలు తొక్కించాయి. సరళంగా సామాన్యులకు సైతం అర్ధం కాగలిగేలా రాసిన ఈ పద్యాలలో అందమైన భావాలను కూడా మిళితం చేసి రాసాడు ఆరుద్ర. ఈ కూనలమ్మ పదంలోని అందమంతా తొలి మూడు పాదాల అంత్యప్రాసలే ! కూనలమ్మ అంటే పార్వతీ దేవి కూతుళ్ళయిన ఏడుగురు అక్కలకు కాపగు పోతురాజు భార్య. . కొన్ని కూనలమ్మ పదాలు . సర్వజనులకు శాంతి స్వస్తి, సంపద, శ్రాంతి నే కోరు విక్రాంతి ఓ కూనలమ్మ ! . ఈ పదమ్ముల క్లుప్తి ఇచ్చింది సంతృప్తి చేయనిమ్ము సమాప్తి ఓ కూనలమ్మ ! . సామ్యవాద పథమ్ము సౌమ్యమైన విధమ్ము సకల సౌఖ్యప్రథమ్ము ఓ కూనలమ్మ ! . సగము కమ్యూనిస్ట్ సగము కాపిటలిస్ట్ ఎందుకొచ్చిన రొస్టు ఓ కూనలమ్మ ! . అరుణబింబము రీతి అమర నెహ్రు నీతి ఆరిపోవని జ్యోతి ఓ కూనలమ్మ ! . మధువు మైకము నిచ్చు వధువు లాహిరి తెచ్చు పదవి కైపే హెచ్చు ఓ కూనలమ్మ ! . తమిళం గురించి -