విశ్వనాథ సత్యనారయణ గారి త్యాగరాజులవారు!

విశ్వనాథ సత్యనారయణ గారి త్యాగరాజులవారు!

(మహతి ఆగష్టు 1972, యువభారతి ప్రచురణ నుంచి; వారి సౌజన్యంతో.)

పూర్వ మహాకవుల పద్యరచన ఏమిటో చెబుతాను. వాళ్ల పద్యరచన అంటే జాతిలో ఉండే శిష్టులు, ఉత్తమ కులజులు, విద్యావంతులు, సంప్రదాయజ్ఞులు అయిన వాళ్ల జీవలక్షణాన్ని, ప్రాణలక్షణాన్ని, వాక్యవిన్యాస వైఖరిని, కంఠస్వరములో ఉండే హెచ్చు తగ్గులని, 

ఈ రీతిగా ఆ జాతి యొక్క పరమశిష్టమైన, నాగరకమైన, జీవునిలోనుండి వచ్చెడి వాగ్వ్యాపారమునకు రూపకల్పనము.

. త్యాగరాజులవారు తాను బహురాగములను కల్పించి (కొన్ని పూర్వమున్నవే), 

వానికి మూర్ఛన లుండగా, తాను వ్రాసెడి కృతినే ఒక షడ్జమములోననో, ఒక పంచమములోననో ఎత్తికొనును. మూర్ఛన క్రిందినించి ఉండును. ఎందుకు ఎత్తికొనును? ఆ రాగములోని భావన అది. తెలుగు భాషయొక్క పలుకుబడి అది. ఈ రహస్యము కృతి నిర్మాణ సమయమున త్యాగరాజ మహర్షికి ఎంత తెలియునో, పద్యరచనా సమయమున మన ఆంధ్ర సాహిత్యమునందున్న పద్యరచనాశిల్పుల కంత తెలియును. ఇది అంతయూ ఉదాహరణ పూర్వకంగా చెప్పవలసిన విషయము.

కావ్యమునందు కథయొక్క ఆరంభము, అవసానము, సర్గలయొక్క ఆద్యంతములు, లోకమును చిత్రించుట, శబ్ద చమత్కారములు చేయుట, ఆవేశము కలిగియుండుట, ఇటువంటివి వందలైన శిల్పములు కలవు. ఈ పద్య రచనా శిల్ప మన్నది వానిని మించినది. ఇది మనస్సుచేత, తెలివిచేత, పది చోట్ల నేర్చుకొనుటచేత, ఆ రచయిత చేసినాడు - ఈ రచయిత చేసినాడని గ్రహించుటచేత వచ్చెడిది కాదు. ఇది ఒక జాతియందు ఒక మహాకవి ఉద్భవిల్లినచో, వాడు పద్యరచయిత యయినచో, ఛందస్సులోని రహస్యము వానికి తెలిసినచో, భాషకు, ఛందస్సునకు, జీవుని లక్షణమునకు కల యవినాభావ సంబంధము వానికి పరమేశ్వరానుగ్రహము వలన పూర్వజన్మ సంస్కార విశేషమువలన సహజమైనచో తెలిసెడిది.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!