జోజో కమలదళేక్షణ

భాగవతములో - 

.
యశోదకు చిన్ని మగవాడు పుట్టెనని గోపికలు చూడ వత్తురు.
వారు చిన్ని కృష్ణుని చూచి, సంతసించి, తెచ్చిన కానుక లిచ్చి -

.
పాపనికి నూనె దలయంటి, పసుపు బూసి
బోరు కాడించి హరిరక్ష పొ మ్మటంచుజలము లొక కొన్ని చుట్టిరా జల్లి తొట్లనునిచి దీవించి పాడి రయ్యువిద లెల్ల

.జోజో కమలదళేక్షణ
జోజో మృగరాజమధ్య జోజో కృష్ణా
జోజో పల్లవకరపద
జోజో పూర్ణేందువదన జోజో యనుచు\న్‌.

.
ఇచ్చట పోతన్నగారు జోలపాట కంద పద్యములో బిగించినారు.


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!