శ్రీ శంకర భగవత్పాద విరచిత " శివానంద లహరి "


ప్రియమిత్రులందరికీ శుభోదయవందనములు .!
(చిదంబర క్షేత్ర నటరాజ స్వామి వారు .)
.
శ్రీ శంకర భగవత్పాద విరచిత " శివానంద లహరి " నుండి.
శ్లో !!
మనస్తే పాదాబ్జే నివసతు వచస్తోత్ర ఫణితౌ
కర శ్చాభ్యర్చాయాం శ్రుతి రపి కథా కర్ణన విథౌ ,
తవ థ్యానే బుద్ధి ర్న యనయుగళం మూర్తి విభవే
పరగ్రంధా న్కై ర్వా పరమ శివ జానే పరమతః . !!
తా.
ఓ పరమ శివా ! నా మనస్సు నీ పాద పద్మము లందును , వాక్కు నిన్ను
స్తుతించడం లోను , చేతులు నిన్ను పూజించడం లోను , చెవులు నీ కథా
శ్రవణం లోను , బుద్ధి నీ ధ్యానం లోను , కళ్లు నీ దివ్య మంగళ విగ్రహాన్ని
చూచుట యందును లగ్నమై వుండు గాక ! ఇక మీదట నా సర్వేంద్రియాలూ
పర విషయాలను ఎరుగ కుండును గాక !!

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !