చలికంఠము!

చలికంఠము!

.
( బాలభాష - శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి .)

.
చలి చలి చలి చందాయమ్మ,
గొంగళి గప్పుకో గోనాయమ్మ,
వడ వడ వడ వడ వణికేనమ్మ,చలిమంటకు చితుకులు తేవమ్మ..,(చలికాలము పసిపిల్లలు కంఠముచుట్టు చిక్కనిబట్ట మడతపెట్టి రెండుమూడు చుట్లు కాళ్లదాకా వచ్చేటట్లు చుట్టించుకొని మెడపక్కను ముడివేయించుకుంటారు. దానిపేరు చలికంఠము. చిదుకులతో చిన్ని మంటవేసి దానికికొంచెం దూరంగా కూర్చుంటారు. దానిపేరు చలిమంట. చలికి వణుకుతూ ఈ పదము పాడుతారు.)

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!