నేర్చుకుందాం...(5)...... కర్మానుగో గచ్ఛతి జీవ ఏకః” కర్మ ఒక్కటే జీవిని అనుసరించును.!


నేర్చుకుందాం...(5)
కర్మానుగో గచ్ఛతి జీవ ఏకః” కర్మ ఒక్కటే జీవిని అనుసరించును.!
.
ఎన్నాళ్ళు ఉండేదేవు ఇహ సుఖములలో ..కొన్నల్లె కద మనసా.
పోయేనాడు వెంబడి రాదు పూచిక పుల్లేనా..అన్నారు.
. నావి అనుకోన్నవేవి మనవెంట రావు, మనం చేసిన మంచి,చెడుల కర్మ ఫలం ఒక్కటే మన వెంట వస్తుంది. అని తెల్పే మంచి సుభాషితం వంటి చాటువు యిది.

“ ద్రవ్యాణి భూమౌ, పశవశ్చ గోష్టే, భార్యా గృహ ద్వారి, జన శ్మశానే,/
దేహశ్చితాయాం, పరలోక మార్గే ‘ కర్మానుగో గచ్ఛతి జీవ ఏకః” //

మనం మరణించి నపుడు – “ రాత్రి,పగలు కష్టపడి సంపాదించిన సంపదలు భూమి మీదనే ఉండి పోతాయి, పశువులు కోష్టం అంటే ‘పశువుల పాక’ అందులోనే ఉంటాయి, ఎంతో ప్రేమగా చూసుకొన్న భార్య ఇంటి ద్వారం వద్దే ఉండి పోతుంది, ( హిందూ సంప్రదాయం లో స్త్రీలు శ్మశానానికి రాకూడదు.) ఎంతో జాగ్రత్తగా పెంచి పోషించిన ఈ దేహం చితిలో కాలిపోతుంది. మనం చేసిన కర్మ ఫలం ఒక్కటే మనవెంట వస్తుంది.” కనుక మంచి కర్మలు(పనులు) చేసి ఉత్తమ గతులు పొందాలని పై శ్లోకం హెచ్చరిస్తుంది.తస్మాత్ ‘ జాగ్రత, జాగ్రత’.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!