Posts

Showing posts from November, 2015

శం కరోతి ఇతి శంకరః" .....ఈశ్వర కృప.!

Image
శం కరోతి ఇతి శంకరః" .....ఈశ్వర కృప.! . . ఈశ్వర కృపా ప్రసరణము జరగడాన్ని 'శ'కార బీజం అంటారు. . అందుకే శివునికున్న పేర్లలో ప్రధానమైన పేరు 'శంకర'. "శం కరోతి ఇతి శంకరః"  . . . కామకోటికి పర్యాయ పదం 'శ'. కోటి అంటే కోటి సంఖ్య అని కాదు, . కోటి అంటే హద్దు అని. కామ అంటే కోర్కె. . కోర్కెల యొక్క హద్దు మీద ఆవిడ నిలబడి ఉంటుంది.  . . దేని అంచైనా ఆవిడే. ఆవిడ ఇవ్వగలదు. ప్రసరణం చేయగలదు.  . కదలిక చేత ప్రసరింపబడితే అమ్మవారు. కదలికలన్నీ ఆగిపోతే శివుడు. . అదీ తత్త్వం.

తెలుగులో తెలుగు నేతిబీరకాయలో నెయ్యంత?

Image
తెలుగులో తెలుగు నేతిబీరకాయలో నెయ్యంత? . ‘నేను, చెట్టు, కన్ను, మొదలు, మన్ను, అమ్మ, చదువు, నేల, ఆకు’, ఇవి అచ్చమైన, కల్తీలేని తెలుగు పదాలు. ఇక్కడ నాకు ఆనందం కల్గించిన విషయం ఏమిటంటే, ‘అమ్మ’, ఈ పదం సంపూర్ణంగా మనది, మన తెలుగు పదం. కనీసం ‘అమ్మ’పైన ఎవరి ప్రభావం లేదు. కాకపోతే కాలానుగుణంగా ఆ పదం కూడా కల్తీ అయి ‘మమ్మీ’ అయిందన్న బాధ లేకపోలేదు. . ఇక్కడ "అచ్చ తెలుగంటే" ఏమిటి అన్న సందేహం కలుగకపోదు.  సంస్కృత సమానం కాని పదాలను, భాషను అచ్చ తెలుగు అంటారు. ఉదాహరణకు, ‘రాజు’ ఈ పదానికి అచ్చ తెలుగు పదాలు ఏలిక, ఎకిమీడు, దొర, పుడమిఱేడు. అలాగే ‘మేఘం’ – నీరుతాలుపు, మబ్బు, మొగిలు.  మనం రోజువారి తెలుగు అనుకొని ఉపయోగించే అనేక పదాలు సంస్కృత పదాలే.  ఉదాహరణకు, సుఖదుఃఖాలు, కంఠం, రథం, ఆజ్ఞ, శ్రీవారి బ్రహ్మోత్సవాలు. చివరికి తెలుగు డిక్షనరీ, క్షమించాలి, నిఘంటువు లేక పదకోశం ఇవేవి తెలుగు పదాలు కావు, సంస్కృతం.. . అనుకరణ వల్ల కావచ్చు, చమత్కారం కోసం కావచ్చు, ఉచ్చరణా సౌకర్యం కోసం కావచ్చు, వ్యావహారిక అనుకూలత, సద్దుబాటు వల్ల కావచ్చు, అన్యభాషా పదాలు తెలుగు పదాల్లాగే మన భాషలో చెలామణీ అయిపోతున్

భరత ఖండంబు చక్కని పాడియావు ! .

Image
భరత ఖండంబు చక్కని పాడియావు ! . భరత ఖండంబు చక్కని పాడియావు హిందువులు లేగదూడలై యేడ్చు చుండ తెల్లవారను గడుసరి గొల్లవారు పితుకుచున్నారు మూతులు బిగియ బట్టి . భరత ఖండం ఒక చక్కని పాడి ఆవు.  భారతీయులు లేగదూడలు.ఏడుస్తూ ఉన్న  ఈ లేగ దూడల మూతులు బిగగట్టి  తెల్లవారు అనే గడుసరి గొల్లవారు పాలు పితుక్కుంటున్నారు.

భర్తృహరి సుభాషితం.

Image
భర్తృహరి సుభాషితం. . ఆపదలందు ధైర్య గుణ మంచిత సంపదలందు తాల్మియున్ భూపసభాంతరాళమున పుష్కల వాక్చతురత్వమాజి బా హా పటుశక్తియున్ యశమునం దనురక్తియు విద్యయందు వాం ఛా పరివృద్దియున్ బకృతి సిద్ధ గుణంబుల సజ్జానాళికిన్ . భావం: ఆపదలు వచ్చినప్పుడు దైర్యము, ఐశ్వర్యము వచ్చినప్పుడు ఓర్పు, సభ యందు వాక్చతుర్యము, యుద్దము నందు శౌర్యము చూపుట,  కీర్తి యందు ఆసక్తి, విద్యలను నేర్పుట యందు గొప్పకోరిక అనునవి  మాహాత్ములకు పుట్టుకతో వచ్చిన స్వభావగుణములు.

బుడుగు ప్రశ్నలు ,,,

Image
బుడుగు ప్రశ్నలు ,,, కళ్ళు మూసుకొనివాడు చెప్పిన జవాబులు. . కాయ కాని కాయ .అవాబులు  1. దీపావళికి పేల్చేది ? --------------------------------->టపాకాయ 2. కోపం వస్తే ఎదుటివారికి ఇచ్చేది ?----------------------.>లెంప కాయ 3. మన ప్రాణానికి అధారమైనది ?-------------------------->గుండె కాయ 4. పిల్లలు ఆడుకొనేది ?------------------------------------>గోళీ కాయ 5. ఎండాకాలం వచ్చేది?------------------------------------>చెమట కాయ 6. బడి పంతులు ఇచ్చేది ?---------------------------------->మొట్టి కాయ 7. ఎక్కువ మాటలాడేవారిని ఇలా అంటారు ?----------------->వాగుడు కాయ 8. తప్పు చేస్తే ఇది లేదంటారు ?------------------------------>తల కాయ 9. చెరువు దగ్గర తిరిగేది ?------------------------------------>ఎండ్ర కాయ 10. తల కింద ఉండేది ? ------------------------------------->మెడ కాయ

నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే

Image
శుభరాత్రి.! నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే… అదేమిటే . నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నవే… అదేమిటే . ఏమిటో ఏం మాయో చేసినావే కంటి చూపుతోటి . ఏమిటో ఇదేమి రోగమో అంటించినావే ఒంటి ఊపుతోటి . ముంచే వరదలా కాల్చే ప్రమిదలా ముంచావే మరదలా .

సొగసు చూడతరమా !

Image
సొగసు చూడతరమా ! సొగసు చూడతరమా… సొగసు చూడతరమా… నీ సొగసు చూడతరమా… నీ సొగసు చూడతరమా… నీ ఆపసోపాలు నీ తీపి శాపాలు ఎర్రన్ని కోపాలు ఎన్నెన్నో దీపాలు అందమే సుమా… సొగసు చూడతరమా… నీ సొగసు చూడతరమా… . అరుగు మీద నిలబడీ నీ కురులను దువ్వే వేళ చేజారిన దువ్వెనకు బేజారుగ వంగినపుడు చిరుకోపం చీర కట్టి సిగ్గును చెంగున దాచి పక్కుమన్న చక్కదనం పరుగో పరుగెత్తినపుడు ఆ సొగసు చూడతరమా… నీ సొగసు చూడతరమా… . పెట్టీ పెట్టని ముద్దులు ఇట్టే విదిలించికొట్టి గుమ్మెత్తే సోయగాన గుమ్మాలను దాటు వేళ చెంగు పట్టి రారమ్మని చెలగాటకు దిగుతుంటే తడిబారిన కన్నులతో విడువిడువంటునప్పుడు విడువిడువంటునప్పుడు ఆ సొగసు చూడతరమా… నీ సొగసు చూడతరమా… . పసిపాపకు పాలిస్తు పరవశించి ఉన్నపుడు పెదపాపడు పాకి వచ్చి మరి నాకు అన్నపుడు మొట్టికాయ వేసి చీ పొండి అన్నప్పుడు నా ఏడుపు నీ నవ్వు హరివిల్లై వెలసినపుడు ఆ సొగసు చూడతరమా… నీ సొగసు చూడతరమా… . సిరిమల్లెలు హరి నీలపు జడలో తురిమి క్షణమే యుగమై వేచి వేచి చలి పొంగులు తెలికోకల ముడిలో అదిమి అలసొ సొలసి కన్నులు వాచి నిట్టూర్పుల నిశిరాత్రిలో నిద

పుట్టినావీ భరతఖండాన, చేత పట్టావ నువు గీత ఎపుడైన?'

Image
పుట్టినావీ భరతఖండాన, చేత పట్టావ నువు గీత ఎపుడైన?' . అమ్మకాల ఆసామీ పిలుపుగంట నొక్కేసరికి పేరిందేవి తలుపు తీసింది. . ' అమ్మా! ఇది చాలా మంచి నిఘంటువు. ఏ తెలుగు పదానికి ఆంగ్లపదం కావాలన్నా ఇందులో దొరుకుతుంది. మీకు ప్రత్యేకమైన తగ్గింపు ధరలో ఇస్తాను. తీసుకోండమ్మా.' . పేరిందేవి విసుగ్గా అంది, ' మా ఇంట్లో నిఘంటువు వుందయ్యా. అదుగో, ఆ బల్ల మీద వుంది చూడు.' . ' అమ్మా! అది నిఘంటువు కాదమ్మా. భగవద్గీత.' . పేరిందేవి ఆశ్చర్యంగా అడిగింది, ' ఇంత దూరం నించి అది ఏ పుస్తకమో కనబడదుగా! అది భగవద్గీత అని నీకెల్లా తెలిసింది?' . ' చాలా దుమ్ము కొట్టుకుని వుండిపోయింది కదమ్మా? ఎప్పుడు తెరవకుండా వున్నారంటే అది భగవద్గీతే అనుకున్నానమ్మా.' ( నేను చిన్నప్పుడు ఆకాశవాణిలో ఒక పాట విన్నాను. ' పుట్టినావీ భరతఖండాన, చేత పట్టావ నువు గీత ఎపుడైన?')

హాస్యభరిత శైలిలో సాంఘిక దురాచారాలను దునుమాడిన నాటకం" కన్యాశుల్కం"

Image
హాస్యభరిత శైలిలో సాంఘిక దురాచారాలను దునుమాడిన నాటకం" కన్యాశుల్కం". . ఆధునిక గద్య రచనకీ ప్రారంభకుడూ, ప్రవక్తా గురజాడ అప్పారావు. ఎన్నెన్నో సాహిత్య రంగాలలో ఆయన కొత్త మార్గాలు తెరచి కొత్త ప్రక్రియలు అవలంబించారు. ప్రత్యేకంగా వచన రచనలో ఆయన వాడుక భాషను స్వీకరించి దానిని మహోన్నతమైన సాహిత్య స్థాయికి తీసుకు వెళ్ళాడు.  గురజాడ చేపట్టక పూర్వం,  ఆయన మాటల్లోనే... "గ్రామ్య భాష దిక్కుమాలిన స్త్రీ... ఆమెను పండితులు నిష్కారణంగా దూషించి అవమానించగా కనికరించి ఫీజు లేకుండా వకాల్తా పట్టితిని"... అన్నాడు గురజాడ. . ఈనాడు వాడుక భాష దిక్కుమాలినది కాదు. గుడిసెల్లో పుట్టి పెరిగి, స్వయంప్రతిభతో కళాశిఖరాలందుకున్న నటీమణీతోనో, స్వల్ప ప్రారంభాల నుంచి బైటపడి, స్వయంకృషితో చదువులన్నీ నేర్చి, పార్లమెంటు భవనాల నలంకరించే విదుషీమణితోనో నేటి వ్యావహారిక భాషను సరిపోల్చవలసి ఉంటుంది. వాడుక భాషకు ఏ ఒక్కరైనా ఇంత గౌరవం సాధించారంటే అతడు గురజాడ అప్పారావనే చెప్పాలి. . మన దేశభాషలన్నింటిలోనూ, పూర్తిగా వచనంతో, అందులోకి పాత్రోచితమైన వ్యావహారిక శైలిలో మొట్టమొదటి నాటకం రాసింది గురజాడ అప్పారావు గారనే అనుక

నిన్నటి రాత్రి నేటి రాత్రి ఒక్కటి కాదు

Image
నిన్నటి రాత్రి నేటి రాత్రి ఒక్కటి కాదు నిన్నటి వెన్నెల ఇవాళ్టి వెన్నెల వేరు వేరు మధ్యలో నలిగే ఈ కాలం గొడవేమిటి ???????????? గుండ్రని భూమికి ధిశలేందుకు మారుతున్నాయి ?????? ఎటు వెళ్ళినా నేను వెనక్కే ఎందుకు వెళుతున్నాను ?????? జీవితాన్ని ఇటు నుంచి అటూ, అటు నుంచి ఇటూ జీవిస్తున్నా కూడా,  తేడా లేదెందుకు ???????????

చాణుక్యుడు చెప్పిన సూక్తి !

Image
చాణుక్యుడు చెప్పిన సూక్తి ! ఎక్కడ మేధావులు.. బందిపోటు దొంగలుకలత చంది అలజడి చెంది ఉంటారో అక్కడ మంచిరాజ పాలనఉంది .. అనిఅర్ధం.

సభలలో కవిత్వం సోంపు !

Image
సభలలో కవిత్వం సోంపు ! . ( రఘునాథ రాయలు . వాల్మీకి చరిత్ర.) . చెప్పఁగ వలె కప్పురములు కుప్పలుగా పోసినట్లు, కుంకుమ పైపై గుప్పిన క్రియ, విరి పొట్లము విప్పిన గతి ఘుమ్మనన్ కవిత్వము సభలన్. . కవిత్వం చెబితే కర్పూరం కుప్పలుగా పోసినట్టు ఉండాలట. కుంకుమ మీద మీద  . కప్పినట్టుండాలట. పూల పొట్లం విప్పినట్టుండాలిట !  . ఎంత గొప్ప కోరికో కదూ ?

శివ ధ్యాన శ్లోకాలు !....(13).

Image
శుభరాత్రి.! శివ ధ్యాన శ్లోకాలు !....(13). . "గౌరీకరామ్బుజన్యస్తస్వర్ణశైలశరాసనమ్ ఇషుహస్తం రథారూఢం నరనారీతనుం స్మరేత్: . గౌరీహస్తమున మేరుధనస్సు పట్టినవాడును, స్వహస్తమున బాణము దాల్చిన వాడును, రథారూఢుండు అగు అర్థనారీశ్వరుని ధ్యానించుచున్నాను. దేవత: భగవంతుడగు శంభువు . ఋషి: భగవంతుడగు శంభువుx
Image
అబ్బో..ఇస్కులో.. బాగానే..సేపుతున్నారే...x

పిల్లగాలికి ఎంత గర్వమో !

Image
పిల్లగాలికి ఎంత గర్వమో !  చెలి కురులను తాకుతోందని ll .  (ఈ ఫోటోలో పిల్లగాలి తగిలిన గర్వం ఎవరికంటే  రెండు కళ్ళూ నెమలికళ్ళను చేసుకు చూస్తున్న ఓయదు ఓయరు.)

శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ !

Image
శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ  .  సురరక్షకుని చూచు చూడ్కులు చూడ్కులు .  శేష సాయికి మ్రొక్కు శిరము శిరము .  విష్ణునాకర్ణించు వీనులు వీనులు .  దేవదేవుని చింతించు దినము దినము .  మధువైరి దవిలిన మనము మనము .  భగవంతు వలగొను పదములు పదములు .  పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి ”

నిత్య సత్యాలు-ఆణిముత్యాలు.!

Image
నిత్య సత్యాలు-ఆణిముత్యాలు.! . అణకువ లేకుంటే అందం కూడా వికారంగా అనిపిస్తుంది. . కసురుతూ మాట్లాడకు-విసుగుతో పనిచేయకు. . కొన్ని సందర్భాలలో మాటలు వెండి-మౌనం బంగారం .. మనస్సు నిర్మలంగా(నిర్ మలినంగా) ఉండటమే శాంతి. . సంతోషంతో ప్ర్రతిపని చేసేవారికి కష్టసాధ్యం ఏమీలేదు. . పరచింత పతనానికి మూలము-స్వచింతన ఉన్నతికి సోపానము. . కోట్లకు అధిపతులైనను-ఒక్క నిముషం ఆయుష్షు కొనలేరు. . ఆదాయానికి మించిన ఖర్చు అప్పు చేయిస్తుంది. . నిర్భయతకు ఆధారం-సత్యత. . అపకారికి ఉపకారం చేయటమే ఉత్తమ లక్షణం.

కొబ్బరి!

Image
కొబ్బరి! . కొబ్బరి ఒక ముఖ్యమైన పాము కుటుంబానికి చెందిన వృక్షం. దీని శాస్త్రీయ నామం 'కోకాస్ న్యూసిఫెరా' (Cocos nucifera). కోకాస్ ప్రజాతిలో ఇది ఒక్కటే జాతి ఉన్నది. ఇవి ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి. కొబ్బరి చెట్టు 30 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. కొబ్బరి కాయ రూపంలో కొబ్బరి చెట్ల నుండి లభిస్తుంది. హిందువులకు ఒక ముఖ్యమైన పూజా ద్రవ్యం. దీనినే టెంకాయ అని కూడా పిలుస్తాం. దీనిని రకరకాల ఆహార పదార్థాలలో రకరకాల రూపాలలో వినియోగిస్తారు. కొబ్బరి చెట్లనుండి వివిధరకాల పదార్ధాలు అనేకమైన పద్ధతులలో ఉపయోగపడుతున్నాయి. కొబ్బరి చెట్లు కోస్తా ప్రాంతాలలోనూ, ఇసుక ప్రాంతాలలోను ఎక్కువగా పెరుగుతాయి. సారవంతం కాని నేలలో కూడా ఇవి పెరుగుతాయి. ఈ చెట్టు సుమారు 100 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. ఇవి సుమారు 100 సంవత్సరాలపాటు జీవించి వుంటాయి. 7 సంవత్సరాల వయసు రాగానే ఈ చెట్టు నెలనెలా చిగురిస్తూ, పూతపూస్తూ ఉంటుంది. భారతదేశపు సాంస్కృతిక జీవనంలో కొబ్బరి చెట్టుకు ఒక ముఖ్యమైన స్థానం ఉంది. దీనిని కల్పవృక్షం - స్వర్గానికి చెందిన చెట్టు అంటారు. ఇది మనకు కావలసిన ఆహారాన్నీ, పానీయాన్నీ, తలదాచుకునే చోటునీ, జీవితానికి కా

కళావిలాసినీ.!

Image
కళావిలాసినీ.! . చూచెదవేలనో ప్రణయ సుందరి, కాటుక కళ్ళలోని యా లోచనలేమిటో హరిణ లోచని నీ చిరునవ్వులోని సం కోచములెందుకో కుసుమ కోమలి నీ మధురాధరమ్ములో దాచుకొనంగ నేటికి సుధామయ సూక్తి కళావిలాసినీx
Image
ప్రాభాతి.!............(కరుణశ్రీ.) . రేగిన ముంగురుల్ నుదుట ప్రేమ సుధా మధురైక భావముల్ ప్రోగులు వోయగా నిదురపోవు దయామయి! నా యెడందలో ఆగక పొంగు స్వాప్నిక రహస్యము లెవ్వియొ నీదు గుండెతో దాగుడు మూత లాడ సరదా పడుచున్నవి కన్నులెత్తుమా!

దేవాదిదేవ.!..........కరుణశ్రీ.

Image
దేవాదిదేవ.!..........కరుణశ్రీ. . తెల వారకుండ మొగ్గలలోనజొరబడి వింత వింతల రంగు వేసి వేసి తీరికే లేని విశ్వ సంసారమందు అలసి పోయితివేమొ దేవాదిదేవ ఒక నిమేషమ్ము కన్ను మూయుదువు గాని రమ్ము! తెరచితి మా కుటీరమ్ము తలుపు కూర్చుండ మా యింట కురిచీలు లేవు నా ప్రణయాంకమే సిద్ధ పరచనుంటి

తెలుగు నాటకాలలో హాస్యం !

Image
తెలుగు నాటకాలలో హాస్యం ! . 1880కు పూర్వం మన ఆంధ్రదేశంలో రంగస్థల ప్రదర్శనలు లేవు. అప్పట్లో ధార్వాడ్ వారు వచ్చి, తాత్కాలిక నాటక శాలలు కట్టి, అందులో హిందీ, మరాఠీ నాటకాలు ఆడేవారు. ఒకసారి రాజమహేంద్రవరలో వాళ్ళు నాటక ప్రదర్శనలు ఇచ్చి వెళ్ళిపోయాక వాళ్ళు వదిలిన పాకలలో "కందుకూరి వీరేశలింగంపంతులు" గారు వారు రచించిన" చమత్కార రత్నావళి "అనే నాటికను ప్రదర్శించారు. ఇదే తెలుగు నాట ఆడబడిన తొలి నాటిక. ఇది హాస్య నాటిక కావడం గమనార్హం. ఇది షేక్స్పియరు "కామెడీ ఆఫ్ ఎర్రర్స"కు అనుసరణ. ఈ ప్రదర్శనకు చాలామంది ప్రేక్షక్కులు వచ్చి, చూచి ఆనందించారు. బ్రహ్మవివాహ విషయంలో కామయ్య తన రెండేళ్ళ వయస్సు కుమార్తెను ముసలి వాడికి పన్నెండువందల రూపాయల కన్యాశుల్కం పుచ్చుకొని పెళ్ళి చేస్తాడు. అయితే పెళ్ళికి ముందుగా వూరి పెద్దలను తను ఇలా కన్యాశుల్కం పుచ్చుకోవడం తప్పా అని అడిగితే ఒక శాస్త్రులు గారు ఏవేవో శ్లొకాలు కల్పించి, ఉదాహరణగా చెప్పి కన్యా కన్నా రెండింతలెత్తు ధనం పుచ్చుకొని పెళ్ళి చేస్తే కోటి యోగాల ఫలితం దక్కుతుందని సమర్ధిస్తారు. కోర్టులో జరిగే అన్యాయాలను బహిర్గతం చెయ్యడమే వ్యవహార బో

‘మనసా రా’

Image
నేను మనసారా దుకాణాలకి వెళ్ళి ‘మనసా రా’ అని కవ్వించే సారా తెచ్చుకోను, మనీ కోల్పోను. . ఏదో ఇలా ఎదుటవాడు మన పర్సు కత్తిరించక పోస్తుంటే నోరెళ్ళబెట్టుకోవడమే. :అది కూడా ఎందుకూ? మంచినీళ్ళో, ఆ రేంజ్ ని దాటి ఆరెంజ్ జూసో అందుకుంటే పోలా? నాకు కొందరు సినీ హీరో హీరోయిన్ల మీద తెగ జాలి. కొందరు ఏదో సరదాగా మిత్రుల బలవంతం వల్ల అలవాటు చేసుకునీ, మరికొందరు అణచుకున్న అవమాన భారం నుంచి తేలిక కావాలనుకునీ ఆ ద్రవం ఉపద్రవం చేసేంతవరకూ రోజుల తరబడి క్షార గరళం మింగుతూ నిక్షేపం లాంటి నట జీవితాన్ని వృధా చేసుకున్నారు,కుంటారు. మామూలు మనుషుల్ని ఎవ్వరూ పట్టించుకోరు. ఇదిగో ఇలా కాస్తో కూస్తో నటనలోనూ, ఇతర ప్రజా ర్రంగాల్లోనూ పేరు సంపాయించుకునేవారు అలా బలి కావడం న్యాయమా? x

వసంత రాగమే హాయి హాయి.. .

Image
. వసంత రాగమే హాయి హాయి! . తీయని ఊహలు హాయిని గొలిపే వసంతగానమే హాయీ’ వసంత గానం హాయి..వసంత రాగమే హాయి హాయి... .కొత్త రాగమున మత్తిలి కోయిల కూయగ, . ‘పాతాళ భైరవి(1951)’ చిత్రంలో ‘ఘాటు’ ప్రేమ అనే  కొత్త ప్రయోగం పింగళి వారిదే. పాట రికార్డింగ్ లో ఎవరో ‘ఘాటు’ బదులు వేరే పదం వేస్తే బావుంటుందేమో అని నసిగారట. పింగళి వారు ఆయన్ని ఘాటుగా కసిరారట. ఈ సినిమాలోనే రాకుమారి తన చెలికత్తెలతో ఉద్యాన విహారం చేస్తూ పాడుతుందే, ‘ తీయని ఊహలు హాయిని గొలిపే వసంతగానమే హాయీ’ అన్నది,  అందులో ఆయన తొలిసారిగా ‘మత్తు’ ని క్రియాత్మకంగా వాడారు, ఎలాగంటే- ‘క్రొత్త రాగమున కుహూకుహూ మని మత్తిలి కోయిల కూయగా’ అని.  . ‘మత్తిలి’ అనేది గమనించారా ?  ’అత్తిలి’ లాంటి ఊరు పేరు కాబోలు అని అనుకునేరు .x

పెళ్లి అయిన కొత్తలో..మీ పిన్ని (అంటే నా శ్రీమతి.) .

Image
పెళ్లి అయిన కొత్తలో..మీ పిన్ని (అంటే నా శ్రీమతి.) . మా పెళ్లి అయిన కొత్తలో ఒక రోజు మా అత్తగారు నన్ను ప్రక్కకి పిలిచి ఒక కాగితం ఇచ్చారు. అందులో ఈ గేయం ఉంది.  . పాపాయి కన్నులు కలువ రేకుల్లు పాపాయి జుంపాలు పట్టు కుచ్చులు పాపాయి దంతాలు మంచి ముత్యాలు . నాకు ఏమి అర్ధం కాలేదు. మీ ఆవిడ ఏడుపు మొదలు పెడితే ఒక పట్టాన ఆపదు. చిన్నప్పుడు ఏడుపు మొదలు పెట్టగానే నేను ఇది పాడేదాన్ని. అంతే ఏడుపు మానేసింది అని చెప్పారు. మీ పిన్ని కాపరానికి వచ్చిన వారం రోజులకి వాళ్ళ అమ్మ మీద బెంగ పడింది. నాకేమో సెలవు లేదు.ఆ మాట అన్నాను అని ఏడ్చేసింది.నాకు చాలా ఖంగారుగా అనిపించింది.ఏం చేయాలో అర్ధం కాక వెంటనే వాళ్ళ అమ్మగారు ఇచ్చిన కాగితం తీసుకుని ఉండుండు ఏడవకు అని గబా గబా ఆ గేయం చదివేసాను. ఇక మీ పిన్ని అటు సంతోషం, ఇటు ఆశ్చర్యం ,మళ్లి అంతలోనే దిగులు.. కాసేపటికి మామూలు మనిషి అయ్యింది." మా అమ్మలా పాడలేదు మీరు ఊరికే పాఠం అప్పచెప్పినట్టు చెప్పారు "అని పోట్లాట మొదలు పెట్టింది. సరే మీ పిన్ని బాధ కన్నా పోట్లాట మంచిది అనిపించి నేను కూడా "పోనిలే అని పాడితే వంకలు పెడతావ ?"అని అన్న

ఉన్నదొక్కటే. .

Image
ఉన్నదొక్కటే. . (శ్రీ ములుకుట్ల సుబ్ర్హమన్య శర్మ గారు.) ఉన్నది ఒక్కటే, లేనేలేదు రెండవది  నీలోనా, నాలోనా మన అందరిలోనా ఉన్నదొక్కటే  నీటిలో,నింగిలో,గాలిలో,అగ్గిలో,భూమిలో  అంతటా వ్యాపించి ఉన్నదొక్కటే "నేను, నేనని" నీవనుచున్నావు, అదే నేనూ అనుచున్నాను  అందరిలోనా వున్న ఈ నేనెవరన్నదే వేదాంతం  ఈ దేహేంద్రియములు, ప్రాణముకూడా కాదు "నేను"  గుండెగుహలో చిరుజ్యోతిగా వెలిగెడి ఆత్మయే "నేను" ఆజ్యోతివెలుగులో వెలుగొందు నీజగము  కనుమూసినంతనే కరగునీ జగము  కట్టకడపటి వరకూరకుండెడివేల  కదలిరా! తెలుసుకో! నీయాత్మ జ్ఞానంబిదే. మాయలో కప్పబడినారు మానవులందరు  ఆ మాయ యను చీకటిని పారద్రోలెడి ప్రజ్ఞ  కలవాడీ ప్రాణికోటిలో నీమానవుడొక్కడే  ఉదయింపచేయు మాజ్ఞానభాస్కరు నీజన్మలోనే జనన మరణ చక్ర భ్రమణ మాగదీజగంబున  ఆప శక్యంబు కాదీ యవనిలో నెవరికీ  మరుజన్మమేమొచ్చొ మనచేతిలో లేదు  సాధించు జన్మరాహిత్య మీజన్మలోనే.

పొట్ట , లావు తగ్గడానికి ఉపాయాలు !

Image
పొట్ట , లావు తగ్గడానికి ఉపాయాలు ! నిద్రపోయే ముందు వెచ్చని నీటితో ఒక టీస్పూన్ మెంతులు పొడి తీసుకోండి. మీ మధ్యాన భోజనం తర్వాత ఒక టీస్పూన్ త్రిఫల చూర్ణం వెచ్చని నీటితో తీసుకోండి. మధ్యానం భోజనం అయిన తరువాత నిద్రపొకూడదు. తెలవారుఝామున గోరు వెచ్చటి నీటిలో తేన నిమ్మకాయ పిండుకుని తాగాలి. ప్రాణాయామ కనీసం 45 నిమిషాలు రోజు క్రమం తప్పకుండ చెయలి ,ప్రతి రోజు 1 లేద 2 km నడవాలి. వంటలో నూనె , దుంపలు , మసాలాలు మానేస్తే మంచిది . మానలేక పోతే కనీసం తగించడం మంచిది. పైన తెలిపిన ప్రకారం గా ప్రతి రోజు చేయడం వలన ఆరోగ్యం బాగావుతుంది మరియు పొట్ట కూడా తగ్గుతుంది .

శివ ధ్యాన శ్లోకాలు !....(12)

Image
శివ ధ్యాన శ్లోకాలు !....(12) . భస్మోద్భాసితసర్వాంగం జటామండలమండితమ్ ధ్యాయేత్త్ర్యక్షం వృషారూఢం గణేశ్వరయుతం హరమ్" . విభూతిచే ప్రకాశించునట్టి యెల్లావయవములు గలవాడును, జటాసమూహముచే అలంకరింపబడినవాడును, మూడుకన్నులు కలవాడును, గణనాథునితో కూడిన వాడును, వృషభమును ఆరోహించినవాడు అగు హరుని ధ్యానించుచున్నాను.x

శివ ధ్యాన శ్లోకాలు !....(11)

Image
శివ ధ్యాన శ్లోకాలు !....(11) . .:రూపయౌవనసంపన్నా మూర్తేవ వనదేవతా పుష్పితాశోకపున్నాగ సహకారశిశూపమః || పంచవింశతి నక్షత్రో మయూరకృతశేఖరః అకలజ్ఞ్కశరచ్చంద్రపూర్ణబింబసమాననః || ప్రాన్తే బద్ధకపర్దాన్తో వసానశ్చర్మ కోమలమ్ సవ్యాపసవ్య విధృతకృతమాల విభూషితః || ధారాకదంబపుంజేన నాభిదేశప్రలంబినా అజజ్ఞ్ఘప్రేక్షణీయేన ప్రేక్షణీయో2పి శత్రుభిః || భార్యాస్య చారుసర్వాంగీ వన్యాలంకారభూషితా ఆదర్శ మూర్తిశ్శోభానాం వన్యానామివ నిర్మలా || . తస్యా హస్తే ధనుర్దత్వా శరమేకం చ నిర్మలమ్ ద్వితీయమంసమాలామ్బ్యశిష్టం వామేన బాహునా || . సుగన్ధి పుష్పస్తబకమాఘ్రాయాఘ్రాయ పాణినా వీజ్యమానో మన్దమన్దం నవపల్లవశాఖయా || . సమావృతో బాలకైశ్చ శ్వభిశ్చాపి మనోహరైః గచ్చద్బిరగ్రతో దృప్తైర్ధ్యాతవ్యో జగతాం గురుః || . . ఏవంభూతో మహాతేజాః కిరాతవపురీశ్వరః . ఆకారము వహించిన రూపయౌవన సంపన్నమగు వనదేవతయో అనదగినవాడును, పుష్పితములగు అశోకపున్నాగసహకారముల గున్నలవలే నున్నవాడును, ఇరువదిఏండ్లవయస్సుకలవాడును, నెమలిపింఛం శిరము నందు దాల్చినవాడును, కలంకములేని శరత్కాలచంద్రుని నిండుబింబము పోలు బింబము గలవాడు, ఒకపక్కకు ముడవబడిన జటాజూటము కలవాడును, కోమలమగు వ్యాఘ్రచర్మము ధరించిన

" పోతన భాగవతము " లోని సరస్వతీ స్తుతి పద్యాలు ! .

Image
" పోతన భాగవతము " లోని సరస్వతీ స్తుతి పద్యాలు ! . "కాటుక కంటి నీరు చను కట్టు పయింబడ నేల యేడ్చెదో కైటభ దైత్య మర్దనుని గాదిలి కోడల యో మదంబ యో హాటక గర్భు రాణి నిను నాకటికిన్ గొని పోయి యెల్ల క ర్ణాట కిరాట కీచకులకమ్మ త్రిశుద్ధిగ నమ్ము భరతీ " "క్షోణి తలంబునన్ నుదురు సోకగ మ్రొక్కి నుతింతు సైకత శ్రోణికి చంచరీక చయ సుందర వేణికి రక్షితామర శ్రేణికి తోయజాత భవ చిత్త వశీకరణైక వాణికిన్ వాణికి నక్ష దామ శుక వారిజ పుస్తక రమ్య పాణికిన్" ! "శారద నీరదేందు ఘన సార పటీర మరాళ మల్లికా హార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మం దార సుధా పయోధి సిత తామర సామర వాహినీ సుభా కారత నొప్పు నిన్ను మది గానగ నెన్నడు గల్గు భారతీ " "అమ్మల గన్న యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పె ద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ, తన్ను లో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ మా యమ్మ కృపాబ్ధి నిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్"x

శివ ధ్యాన శ్లోకాలు !....(10) .

Image
శివ ధ్యాన శ్లోకాలు !....(10) . "ముక్తాలంకృతసర్వాంగమిన్దుగంగాధరం హరమ్, ధ్యాయేత్కల్పతరోన్మూలే సమాసీనం సహోమయా". . ముత్యములచే అలంకరింపబడిన సర్వావయములనుకలవాడు, చంద్రుని గంగను ధరించినవాడును, ఉమతోకూడ కల్పవృక్షము క్రింద కూర్చుండినవాడును అగు హరుని ధ్యానించుచున్నాను. . దేవత: రుద్రుడు . ఋషి: మండూకుడుx

అదిగదిగో గగన సీమా

Image
శుభరాత్రి! . అదిగదిగో గగన సీమా  అందమైనా చందమామా ఆడెనోయి  ఇదిగిదిగో తేలి తేలి చల్లనైన  పిల్ల గాలి పాడెనోయీ  సా రి గ మ ప ద ని సా  సా దా ప మ రి గ మ రి స

నదీసుందరి!

Image
నదీసుందరి!...... అబ్బూరి రామకృష్ణరావు . పూవుపొడితో పసుపుబూసుక కావియిగురుల కాంతు లద్దుక త్రోవ లెఱిగిన చరణములతో రావె! సంధ్యాకామినీ! ఉదయకన్యలు కలశములతో పిదికి పంపిన యాలమందల పొదుగులను క్షీరముల నింపితి గదవె! సంధ్యాకామినీ! పచ్చిమాలతి యాకుమడుపులు గ్రుచ్చి వేసిన పూలదండలు తెచ్చియుంచితి మొక్కమా రిటు వచ్చిపో! సంధ్యాంగనా! నల్లనల్లని కలువదండల నెల్లదిశలను నిదుర నెలతలు అల్లిపోవక మునుపె యమృతము చల్లిపో! సంధ్యాంగనా! ఎవరిపై నీవలపు నిలిపితి? వెవరికై యీపారవశ్యము? భువనభువనము లెల్ల తిరిగెద వవుర! సంధ్యాకామినీ! ఉదయమున వెలిచీరచాటున కొదమసంజల కావిముసుగున పొదలునది నీవొకతెవేనా? ఉదయ సంధ్యాకామినీ!

పోతన - శ్రీమద్భాగవతం.!

Image
పోతన - శ్రీమద్భాగవతం.! . ఎవ్వడు సృజించు బ్రాణుల నెవ్వడు రక్షించు ద్రుంచు నెవ్వడనంతుం డెవ్వడు విభుడెవ్వడు వా డివ్విధమున మనుచు బెనుచు హేలారతుడై! భావం:--- . ఈ లోకంలో సర్వప్రాణులను ఎవడు సృష్టిస్తాడో, ఎవడు రక్షిస్తాడో,  . ఎవడు అంతం చేస్తాడో, ఎవడు అనంతుడో, ఎవడు సర్వవ్యాపకుడో... .  ఆ విభుడే ఈ విధ ంగా పోషించేవాడు, పెంచేవాడు (సర్వం చేసేవాడు) అని అర్థం. . చిత్రంబులు త్రైలోక్య ప విత్రంబులు భవలతాలవిత్రంబులు స న్మిత్రంబులు మునిజనవన చైత్రంబులు విష్ణుదేవు చారిత్రంబుల్! . భావం:---- . శ్రీమహావిష్ణువు చరిత్రలు కేవలం విచిత్రాలు మాత్రమే కావు. ముల్లోకాలను పవిత్రం  . చేసేటువంటివి. జీవరాసులకు మంచిమిత్రుల వంటివి. అడవులకు వసంత ఋతువు ఆనందం  . కలిగిస్తుంది. అదేవిధంగా ఈ చరిత్రలు మునులకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఇవి సంసార బంధం . అనే లతలను అవలీలగా ఛేదించే లవిత్రాలు (కొడవలి వంటివి)... . బాలున్ హరిపదచింతా శీలున్ సుగుణాలవాలు శ్రీమన్మేధా జాలున్ సంతోషించక యేలా శిక్షించె రాక్షసేంద్రుండనఘా! . భావం:----. . ఈ లోకంలో సర్వప్రాణులను ఎవడు సృష్టిస్తాడో, ఎవ

లేపాక్షిబసవన్న!

Image
లేపాక్షిబసవన్న! . “లేపాక్షి బసవయ్య లేచి రావయ్య కైలాస శిఖరాన నడచి రావయ్య'' . స్వాతంత్ర్య పూర్వం బహుముఖ ప్రతిభావంతులైన అడవి బాపిరాజు .పరవసుడయే పాడి ఆ నంది గొప్పదనం చాటారు . ఈ లేపాక్షి బసవన్న 8.1 మీటర్ల పొడవు, నాలుగన్నర మీటర్ల ఎత్తుతో మహా లింగానికి ఎదురుగా కూర్చుని ఉంటుంది.  ఇది భారతదేశంలోనే అతిపెద్ద నంది శిల్పంగా పేరుగాంచింది.  తంజావూరు బృహదీశ్వరాలయం, మైసూరులోని చాముండి హిల్,  బెంగళూరులోని బసవనగుడిలలో ఉండే నంది విగ్రహాలకంటే, లేపాక్షి విగ్రహమే పెద్దది. మంచి ఆరోగ్యంతో ఉండే చక్కటి కోడెగిత్త విగ్రహమే లేపాక్షి. గంటలు, లోహపు బిళ్లలతో కూడిన పట్టీలు మొదలైన ఎన్నో అలంకరణలు ఉన్నప్పటికీ, ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది మాత్రం నంది మెడలో కనిపించే రెండు గరుడ పక్షులు, వాటి ముక్కుల్లో వేలాడే ఏనుగులే. ఇది ఆ పక్షుల శక్తిని, పరిమాణాన్ని సూచిస్తుంది. . సీతమ్మతల్లిని రావణుడు చెరబట్టి తీసుకెళ్తుంటే,  ఆమెను కాపాడబోయి గాయపడ్డ జటాయువును  చూసిన శ్రీరామచంద్రుడు లే పక్షీ అని పిలిస్తే,  జటాయువు లేచి నిలుచుందని,  అందుకే ఈ స్థలానికి లేపాక్షి అనే పేరు వచ్చిందని చెబుతుంటారు.

తొక్కుడు బిళ్ళఆట !

Image
తొక్కుడు బిళ్ళఆట ! ఎంతమంది ఆడవచ్చు : ఇద్దరు. కావలసిన వస్తువులు : చిన్న రాతి పలక బిళ్ళ. ముందుగా పక్కపక్కనే ఉండే నాలుగు నిలువు గళ్ళు, రెండు అడ్డగళ్ళు గల దీర్ఘ చతురస్త్రాకార గడులను గీయాలి. తరువాత గడుల బయట బాలికలు నిలుచోవాలి. ముందుగా ఒక బాలిక చేతిలో బిళ్ళను ముందు గడిలో వేసి కాలు మడిచి మిగతా ఎనిమిది గడులను దాటించి బయటకు తీసుకురావాలి. తరువాత రెండవ గడి, తరువాత 3,4,5,6,7,8, ఇలా అన్ని గడులను దాటించాలి. జాగ్రత్త! ఏ సమయంలో కూడా కాలు గాని, బిళ్ళగాని, గడుల గీతలను తాకరాదు. గడులన్ని అయిపోయాక కాలి వేళ్ళ మధ్య బిళ్ళను బిగించి పట్టుకుని దాన్ని కుంటి కాలితో ఎనిమిది గడులను గెంతి రావాలి.అలాగే కాలి మడం మీద పెట్టి గడులను దాటాలి. తరువాత తలపై పెట్టుకొని దాటాలి. తరువాత అర చేతిలో, ఆపై మోచేతిపై , భుజం పై, పెట్టుకొని అన్ని గడులను దాటాలి. తరువాత బిళ్ళను గడుల అవతల వేసి కళ్ళు మూసుకొని అన్ని గడులను దాటాలి. ఇవన్నీ దాటితే ఆట వారిదే అవుతుంది. మధ్యలో గీత తొక్కితే ఒకటి రెండు గడులు బాలికవి అవుతాయి. మిగతా బాలికలకు అప్పుడు ఆడటం కష్టమవుతుంది.

చక్కగా శ్రద్ధగా చదువు కూనే పిల్లలు చూస్తే ముద్దువస్తుంది.

Image
                                       చక్కగా శ్రద్ధగా చదువు కూనే పిల్లలు చూస్తే ముద్దువస్తుంది.

భక్త కన్నప్ప.! .

Image
భక్త కన్నప్ప.! . శ్రీ ఆదిశంకరాచార్యా విరచిత శివానందలహరి...శ్లోకం..63 . "మార్గావర్తితపాదుకా పశుపతేరంగస్య కూర్చాయతే గండూషాంబునిషేచనం పురరిపోర్దివ్యాభిషేకాయతే| కించిద్భక్షితమాంసశేషకబళం నవ్యోపహారాయతే భక్తిః కిం న కరోత్యహో వనచారో భక్తావతంసాయతే"|| . త్రోవలవెంబడి తిరిగిన పాదుకములు సకల భూనభోంతరాళములయందున్న . . . ప్రాణిసమూహమునకు అధిపతియగు ఈశ్వరునికి పవిత్రధర్భాంబరములై ఒప్పుచున్నవి. నోటపుక్కిట బట్టి తెచ్చిన నీరు మూడు లోకములనూ ఏక శరముతో దండించిన ప్రభువుకు దివ్యాభిషేకముగా భాసించుచున్నది. కొంచెము ఎంగిలి చేసి రుచి చూసి తెచ్చిఇచ్చిన మాంస ఖండము శ్రీకాళహస్తీశ్వరునికి అప్పుడే వండి తెచ్చిన నైవేద్యమై శోబిల్లుచున్నది. భక్తిచేత కాని కార్యము గలదే, ఒక బోయవాడు భక్తులలో పరమశ్రేష్టుడై పరమపదమునందినాడు. (ఆచార్యుల వారు తిన్నడిగా పుట్టి శ్రీకాళహస్తీశ్వరున్ని శరణు కోరి చేరి భజించి భక్త కన్నప్పగా మారిన ఒక బోయవాడి ఉదంతమును తెలుపుచున్నారు.) ..... .నయనార్లు (కన్నప్ప) నయనార్లు క్రీ.శ 5 మరియు 10వ శతాబ్దాల మధ్య తమిళనాడు రాష్ట్రంలో నివసించినట్లుగా చెప్పబడుతున్న 63 మంది గొప్

శివ ధ్యాన శ్లోకాలు !....(9)

Image
శివ ధ్యాన శ్లోకాలు !....(9) . "ప్రణమదమరలోకమౌళి మాలాకుసుమ రజో2రుణపాదపద్మయుగ్మమ్, అనవరతమనుస్మరేద్భవాన్యా సహజగతాం పితరం పినాకపాణిమ్." . నమస్కరించుచున్న దేవతలసమూహముయొక్క శిరస్సులందలి పూదండలపూవుల పరాగముచే గొంచెం ఎఱ్ఱనైన కమలములవంటి పాదములజంటకలవాడును,  లోకములకు తండ్రియును, పినాకమను ధనస్సుచేత కలవాడును, భవానితో కూడినవాడుఅగు రుద్రుని, నిరంతరము మనస్సులో స్మరించుచున్నాను. . దేవత: భగవంతుడు ఋషి: భగవంతుడు x

గీత దాటని సీత...

Image
. గీత దాటని సీత...బిచ్చం మనం గడప లోపలి పిల్చి వెయ్యాలి  . ఇది రాజా రవి వెర్మ పెయింటింగ్.

మామిడి !

Image
మామిడి ! మామిడి (ఆంగ్లం: Mango) కి నాలుగు వేల సంవత్సరముల చరిత్ర ఉన్నది.  ఇది భారతదేశపు జాతీయ ఫలం. ఇవి మాంగిఫెరా (Mangifera) ప్రజాతికి చెందిన వృక్షాలు. వీటి కాయలను ఊరగాయల తయారీలో ఉపయోగిస్తారు. మామిడిపళ్ల నుండి రసం తీసి తాగుతారు. వీటినుండి మామిడి తాండ్ర తయారు చేసి అమ్ముతారు. ఇందులో కెరోటిన్ , విటమిన్ సి, కాల్షియం ఎక్కువ.దీని ఆకులను "చూత పత్రి" అని కూడా అంటారు. ఈ ఆకు పచ్చ రంగులో ఉంటుంది. ఆకారం కిరీటం ఆకారంలో ఉంటుంది. పరిమాణం పెద్దది. ఈ చెట్టు మహావృక్షం గా పెరుగుతుంది. భారతదేశంలో వంద రకాలకుపైగా మామిడిపళ్ళు దొరుకుతాయి.  .మామిడి ఉపయోగాలు ప్రపంచం అంతటా ఇప్పుడు మామిడి పండు తినడం పట్ల మక్కువ పెరిగింది. ఇప్పుడు ఈ పంటను సమశీతోష్ణ పరిస్థితిలో కూడా పండిస్తూ ఉన్నారు భారతద్వీపకల్పం అంతటా, కరేబియన్(Caribbean), మధ్య అమెరికా, మధ్య ఆసియా, దక్షిణ తూర్పు అసియా, మధ్య మరియు దక్షిణ ఆఫ్రికా దేశాలలోను పండిస్తున్నారు. దీనిని ఎక్కువగా తాజాగానే తింటారు. ఇంకా పంటగా వేయని దక్షిణ ఫ్లోరిడాలో కూడా మామిడిచెట్టుని ఇంటి పెరటిలో చూడవచ్చు. మామిడిపండ్లు ప్రపంచమంతా ఇష్టమైన ఆహారమే అయినా రైతులు తక్కువ ప్

‘ గౌరమ్మా నీ మొగుడెవరమ్మా

Image
‘మూగమనసుల’  . ఈ సినిమాలో కొసరాజు - ‘ గౌరమ్మా నీ మొగుడెవరమ్మా ’ పాట రాశారు.  . ‘సగం దేహమై నేనుంటే , అది పెళ్ళామంటే సెల్లదులే పళ్ళు పదారు రాలునులే పళ్ళు పదారు రాలునులే’ పళ్ళు ఎవరికైనా ముప్పై రెండు కదా? పదారు (పదహారు) అని ఎందుకు రాశారు? ‘పళ్ళు - పదారు’ అనే ప్రాస కోసమేనా? కొసరాజు అలా అర్థమేమీ లేకుండా రాస్తారా?! మరి దీనిలో అంతరార్థమేంటి? పురాణాల్లో శివుడు అర్ధ నారీశ్వరుడు కదా? నోట్లో సగం పళ్ళు గౌరి (పార్వతి) వే. కాబట్టి మిగిలిన పదహారు పళ్ళ సంగతే ప్రస్తావించి, అవి రాల్తాయని చమత్కారంగా చెప్పటమన్నమాట!

దుర్వాసుడు కోపిష్టి ఎందుకు అయ్యాడు?

Image
దుర్వాసుడు కోపిష్టి ఎందుకు అయ్యాడు? . దుర్వాసుడి పుట్టుక గురించి పురాణాలలో ఎన్నో కథలు ఉన్నాయి. వాటిలోని ఒకానొక కథను అనుసరించి, ఒక సారి బ్రహ్మకు, శివుడికి మధ్య మాటామాటా పెరిగి పెద్ద రాద్థాంతం అయ్యింది. పరమేశ్వరుడు ప్రళయరుద్రుడు అయ్యాడు. ఆయన కోపాగ్ని జ్వాలాలకు దేవతలు తల్లడిల్లిపోయారు. పార్వతి సైతం తన భర్త కోపాన్ని భరించలేక, శివుణ్ని చేరి 'దుర్వాసంభవతిమి' అంటే మీతో కాపురం చేయడం కష్టమైపోతోంది' అంటూ వాపోయింది. అప్పుడు రుద్రుడు తన కోపాన్నీ, ఉద్రేకాన్నీ మరొకరిలో ప్రవేశపెట్టి పార్వతిని సుఖపెట్టాలనుకున్నాడు. తరువాత జరిగిన ఒకానొక సంఘటనలో త్రిమూర్తులు అనసూయా దేవికి ప్రత్యక్ష్యమై ఏదైనా వరం కోరుకొమ్మన్నారు. అప్పుడు ఆ మహా సాధ్వి 'మీ ముగ్గురి దివ్యాంశలతో నాకు బిడ్డలు కలగాలి'. అని కోరుకుంది. వారు సరేనన్నారు. ఆ ప్రకారం బ్రహ్మ అంశతో చంద్రుడు, మహా విష్ణువు అంశతో దత్తాత్రేయుడు కలిగారు. ఆగ్రహాన్ని శివుడు అనసూయలో ప్రవేశపెట్టగా, ఆ కోప స్వభావునిగా, ఆనసూయకు దుర్వాసుడు పుట్టాడు. అలా కోపానికి మారు పేరయ్యాడు.

శివ ధ్యాన శ్లోకాలు !....(8)

Image
శివ ధ్యాన శ్లోకాలు !....(8) . "ఉద్యద్భాస్కరకోటి ప్రకాశదీప్తదహనమూర్థనమ్, బీషణభుజంగభూషం ధ్యాయేద్వివిధాయుధం రుద్రమ్." . ఉదయించుచున్న కోటిసూర్యులవలే ప్రకాశముకలవాడును, మండుచున్న అగ్నివంటి శిరస్సు కలవాడును,  భయంకరములైన సర్పములు ఆభరణములుగా గలవాడును,  నానా విధములగు ఆయుధములుగలవాడు అగు రుద్రుని ధ్యానించుచున్నాను. . దేవత: రుద్రుడు . ఋషి: నారదడు x

సత్య హరిశ్చంద్ర లో..బలిజేపల్లి లక్ష్మి కంత కవి గారి వారి ఒక పద్యం.

Image
సత్య హరిశ్చంద్ర లో..బలిజేపల్లి లక్ష్మి కంత కవి గారి వారి ఒక పద్యం. . "మాయామేయ జగంబె నిత్యమని సంభావించి మోహంబునన్ నా యిల్లాలని నా కుమారుడని ప్రాణంబుండు నందాక నెం తో యల్లాడిన యీ శరీర మిపుడిందున్ గట్టెలన్ గాలుచో నా యిల్లాలును రాదు పుత్రుడును తోడై రాడు తప్పింపగన్.! . ఇందులో ఉన్నది పూర్తిగా వ్యక్తిగత దృష్టి. వ్యక్తిగా మనం మన శరీరంతోనూ, మనసుతోనూ అనేక బంధాలను పెంచుకుంటాం. ఆ బంధాల చుట్టునే మన బతుకు గుడుసుళ్ళు తిరుగుతుంది. "నేను" అనే ఒక భావం ఉన్నంత వరకూ ఆ బంధాలు ఉండనే ఉంటాయి కదా. . అంటే "నా" దృష్టిలో అవి నిత్యమే! అందులో మాయంటూ ఏముంది? ప్రాణం పోయిన తర్వాత ఇక "నేను" అన్నదే లేదు. మనసూ లేదు, అందులో భావాలూ లేవు, బంధాలూ లేవు. శరీరం కట్టెల్లో కాలిపోయేటప్పుడు "నా" అనుకొనేది ఏదీ అక్కడ లేదు. అంచేత అలాంటి సందర్భంలో "నా యిల్లాలు, నా పుత్రుడు" అనుకొనే ప్రసక్తే లేదు, ఇంక వాళ్ళు తోడై రావడమేమిటి? ఇక్కడ జరుగుతున్నది ఏమిటంటే, బతికుండి, ఆలోచించే బుద్ధి ఉండి, ఊహించే మనసుండి, భావాలు బంధాలూ అన్నీ ఉన్న స్థితిలో మనిషి తన "చావు"ని గు

చెప్పితే అల్లరి... అడిగితే తుంటరి...

Image
చెప్పితే అల్లరి... అడిగితే తుంటరి...  చెప్పనా...సిగ్గు విడిచి చెప్పరానివి...  అడగనా...నోరు తెరిచి అడగరానివి...

సీత అగ్నిప్రవేశం.. సీతకన్నా కూడా రామునికే అగ్ని పరీక్షగా మారింది. .....

Image
సీత అగ్నిప్రవేశం.. సీతకన్నా కూడా రామునికే అగ్ని పరీక్షగా మారింది. ..... .  (రామాయణ కల్పవృక్షం.! శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు.) .  హనుమంతుని తోకకి నిప్పంటించినప్పుడు, అది కాలకుండా, అగ్నికున్న ఉష్ణాన్ని సీత తనలో దాచుకుంటుందిట!  ఇంద్రజిత్తు వేసిన ఒక అస్త్రానికి రామలక్ష్మణులు మూర్ఛపోతారు.  అప్పుడు రావణుడు వాళ్ళు చనిపోయారనే భావించి సీతదగ్గరకి వచ్చి, వాళ్ళు చనిపోయారన్న వార్త చెప్తాడు.  సీత నమ్మదు. త్రిజట స్వయంగా యుద్ధరంగానికి వెళ్ళి చూసివచ్చి చెప్తుంది, వాళ్ళు పడిపోయే ఉన్నారు కాని వాళ్ళ ముఖాలు కాంతివంతంగానే ఉన్నాయని.  అప్పుడు సీత ఒక విచిత్రమైన మొక్కు మొక్కుకుంటుంది. .  ఈ ఆపదనుంచి రామలక్ష్మణులు బయట పడిన తర్వాత, ఏ అగ్నిసాక్షిగా అయితే తను రాముని పెళ్ళాడిందో, ఆ అగ్నిలో తాను దూకుతానని ఆ మొక్కు.  రావణుడాంటాడు, రామునిలాంటి భర్తని నమ్ముకుంటే నీకు అగ్నిప్రవేశమే గతి అని! రాముడెలాగూ యుధ్ధంలో చనిపోతాడు, అతనితో సీత సహగమనం చెయ్యడానికి నిప్పులో దూకాల్సి వస్తుంది అని అక్కడ రావణుని ఉద్దేశం.  మరి తర్వాత సీత చేసిన అగ్నిప్రవేశం తన మొక్కు తీర్చుకోడానికా? తన భర్త ఉన్నా తనకి లేనట్టే

సతి దేవి ప్రాణ త్యాగం......పోతన భాగవత పద్యం.!

Image
సతి దేవి ప్రాణ త్యాగం......పోతన భాగవత పద్యం.! . తండ్రి అయిన దక్షప్రజాపతి దక్షయజ్ఞ సమయంలో ప్రవర్తించిన తీరును నిరసించి సతీదేవి పలికిన పలుకులు:  . జనుడజ్ఞానమునన్ భుజించిన జుగుప్సంబైన యన్నంబు స య్యన వెళ్లించి పవిత్రుడైన గతి దుష్టాత్ముండవై యీశ్వరున్ ఘను నిందించిన నీ తనూభవ ననంగా నోర్వ నీ హేయ భా జనమైనట్టి శరీరమున్ విడిచి భాస్వచ్ఛుద్ధి ప్రాప్తించెదన్ . భావం:  మనిషి, తనకు తెలియకుండా తినకూడని పదార్థాలు తిన్నప్పుడు వెంటనే వాంతి చేసుకుని ఉదరాన్ని శుభ్రం చేసుకుంటాడు. చెడు స్వభావం కలిగిన నువ్వు, గొప్పవాడైన పరమశివుని నిందించిన కారణం చేత, నేను నీ కుమార్తెను అనిపించుకోవడాన్ని సహించలేను. అందువల్ల ఈ అసహ్యమైన శరీరాన్ని విడిచి, పవిత్రతను పొందుతాను.

ప్రాస పదాలు!

Image
ప్రాస పదాలు! . (ఈ పదాలు నేను తెలుగు దానం అనే వెబ్ సైటు నుంచి తీసుకున్నవి.  వారికి కృతజ్ఞతలు.) .  పాప గిలక తాత పిలక సబ్బు మరకగడ్డి పరక గుడి గంటవరి పంట రంగు పలకకంటి నలక పళ్ళ గంపముళ్ళ కంప పిచ్చి కుక్కపూల మొక్క చిట్టి తల్లిబుజ్జి చెల్లి కాకి ఈకమేక తోక తేలు కొండిరైలు బండి బావి గట్టురావి చెట్టు దోస పండుపూల చెండు పట్టు కుచ్చుగొర్రె బొచ్చు గండు పిల్లిబొడ్డు మల్లి చీల మండుగోల కొండ వెండి కొండనిండు కుండ ఆల మందతీయ కంద వరి అన్నంరాతి సున్నం నీటి బుడుగపాము పడగ ప్రాస వాక్యాలు మంచి మాట ముద్దుకల్లలాడవద్దు కీడు చేయ ముప్పువాదులాడ తప్పు కట్టు లేని నోరుగట్టు తెగిన ఏరు పెద్ద వారి మాటపెరుగన్నం మూట కలసి మెలసి మెలుగుకలిమి బలిమి కలుగు పొల్లుమాట విడువుగట్టిమాట నుడుపు మాట తప్పబోకుమంచి విడువబోకు అడుసు తొక్కుటేల?కాలు కడుగు టేల? చదువురాని మొద్దుకదలలేని ఎద్దు కీడుచేయ ముప్పువాదులాడ తప్పు మంచివిద్య చదువుమంచిబుద్ధులొదవు గట్టిమాట నుడువుగర్వమంత విడువు ప్రియములేని విందునయముకాని మందు పోరునష్టం పొందులాభం కలసి ఉంటే కలదు సుఖం. ఇలాంటి పదాలు గమనించండి