గోపయ్య నల్లనా.. ఎందువలనా?
గోపయ్య నల్లనా.. ఎందువలనా? గోపయ్య నల్లనా.. ఎందువలనా? . "అమ్మా.." "ఏం కన్నయ్యా!" అని అడిగింది యశోదమ్మ కృష్ణుడిని. "నాకు కోపమొచ్చింది" "కోపం అంటే ఏంటి, కన్నయ్యా?" "ఏమో! వచ్చింది. అంతే!" "సరే, వచ్చింది లే!" "ఉహూ, ఎందుకూ? అని అడుగు" "హ్మ్" "హ్మ్మ్ కాదు, "ఎందుకు కన్నయ్యా?" అని అడగాలి" "అడిగాను లే , చెప్పు" "నన్ను నల్ల వాడని అన్న నవ్వాడు." "పోన్లే, అన్నేగా!" "వల్లభుడు కూడా నవ్వాడు. నీలమణీ నవ్వాడు." "నవ్వనీలే నాన్నా. వాళ్ళని తెల్లవాళ్ళని నువ్వూ నవ్వు." "మరి నువ్వూ తెల్లగా ఉంటావూ!" "అయితే!" "అందరూ తెల్లగానే ఉంటారు. నా అంత నల్లగా ఎవరూ ఉండరు." "నీ అంతవాడివి నువ్వే కన్నా!" "అంటే?" "గొప్పవాడివనీ.." "గొప్ప కాదు నల్లవాడినట." "అయితే ఏం? నీ కళ్ళంత అందమైన కళ్ళు ఎవరికైనా ఉన్నాయా? నీ జుత్తు చూడు ఎంత నల...