"చచ్చిరి సోదరుల్,"..

"చచ్చిరి సోదరుల్,".. 

(శ్రీ పిస్కా సత్యనారయణ గారి విశ్లేషణ .)

రణరంగములో నిహతులైపోగా, ఒంటరిగా మిగిలిన దుర్యోధనుడు ద్వైపాయనహ్రదము (మడుగు) లో దాక్కుంటాడు. 

అతడిని బైటకు రప్పించడానికి ధర్మరాజు చేస్తున్న ప్రయత్నం.

"చచ్చిరి సోదరుల్, సుతులు చచ్చిరి, చచ్చిరి రాజులెల్ల, రీ

కచ్చెకు మూలకందమగు కర్ణుడు మామయుఁ జచ్చి; రీ గతిం

బచ్చనికొంప మాపితివి, బాపురె! కౌరవనాథ! నీ సగం

బిచ్చెద, జీవితేచ్ఛ గలదేని బయల్పడుమయ్య గ్రక్కునన్!"

(పాండవ విజయము నాటకము - తిరుపతివేంకటకవులు)

.

భావము: శ్మశానముగా మారిన సమరరంగమును పై పద్యములో ధ్వనింపజేస్తున్నాడు ధర్మజుడు. పచ్చని కుటుంబానికి చిచ్చుపెట్టినవారు అందరూ చచ్చినారని చెప్తున్నాడు. చిటారుకొమ్మన చివురులాగా దుర్యోధనుడు మాత్రం మిగిలివున్నాడు. అతడిని బ్రతికిస్తానని అంటున్నాడు యుధిష్ఠిరుడు. జీవితముపై ఆశ ఉంటే మడుగులో నుండి బైటికి రమ్మని పిలుస్తున్నాడు..... దాక్కోవడమే రాజునకు దరిద్రపు చావు. 

"దేహి" అనడం మరీ దీనమైన చావు. ఈ రెండుచావుల కన్నా, 

వీరోచితమైన మరణమే మేలు....

రారాజు అభిమానం అప్పటికీ చావలేదు; భీమునితో యుద్ధం చేసి, కొసమెరుపు మెరిసి ఆరిపోయాడు. ధర్మానికి తొడలు విరుగగొట్టాలని చూసిన వీరుడు, తానే తొడలు విరిగి నేలకొరిగాడు.

"చచ్చుట" అనే క్రియాపదమును తెలుగువారు తరచుగా నానార్థాల్లో 

వాడతారు. పదేపదే ఆ పదమును వాడిన ఈ పద్యం తెలుగువారికి బాగా 

నచ్చింది.

***** ***** *****

Comments

Popular posts from this blog

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.