కవికీ, కంసాలికీ సీసం లోకువ.”

కవికీ, కంసాలికీ సీసం లోకువ.” అని నానుడి.

కంసాలి లోహమైన ‘సీసము’నూ, కవి పద్యఛందస్సు 

ఐన “సీసం”నూ ప్రజ్ఞతో వాడుతారు, అని శ్లేష. 

శ్రీనాథుడు అందుకు పర్యాయపదము.

.శ్రీనాథుడు అనగానే తెనుగు ఛందస్సు సీసము మనకు 

తటిల్లతవలె మెరుస్తుంది.

ఈ పద్యాన్ని అవధరించండి.

.

సీ॥రాజ నందన రాజరాజాత్మజులు సాటి;

తలపనల్లయవేమధరణి పతికి!

రాజ నందన రాజరాజాత్మజులు సాటి అ

తలపనల్లయవేమధరణి పతికి!

రాజ నందన రాజరాజాత్మజులు సాటి

తలపనల్లయవేమధరణి పతికి!

రాజ నందన రాజరాజాత్మజులు సాటి

తలపనల్లయవేమధరణి పతికి!

.

గీ||

భావ భవభోగ సత్కళా భావములను;;

భావ భవభోగ సత్కళా భావములను;;

భావ భవభోగ సత్కళా భావములను;

భావ భవభోగ సత్కళా భావములను.

(భావ.. భవభోగ.. సత్కళా ..భావములను.)సీస పద్యంతో మన తెలుగు కవులు ఎన్ని లయలని మరెన్ని హొయలని సాధించారో వివరించాలంటే, అదొక పెద్ద వ్యాసమే అవుతుంది. మచ్చుకి ముచ్చుటగా మూడు


దైతేయ మదవతీ ధమ్మిల్లములతోడ

విరుల నెత్తావికి వీడుకోలు

దనుజ శుద్ధాంత కాంతా కటాక్షములతో

గలికి కాటుకలకు గాని వావి

దానవ మానినీస్తన కుంభముల తోడ

బసుపు బయ్యెదలకు బాయు

తెరువు దైత్యావరోధన దయితాధరములతో

సొబగు వీడెములకు జుక్క యెదురు


చేసి సురసుందరీ కరోశీరతాల

వృంత చలితాంత కుంతల విలసదింద్ర

కులవధూటీ లలాటికా కుంకుమంబు

బదిల పఱుప చక్రంబ నీ భరము కాదె.


ఇది సీస పద్యపు తూగుని సాంతం చూపించే రమణీయమైన పద్యం; నాచన సోమన రచించిన ఉత్తరహరివంశము లోనిది. ఇందులో సీసపాదం మొదటి భాగం సంస్కృత పదాలతోనూ, రెండవ భాగం తెలుగు పదాలతోనూ కూర్చడం వల్ల మంచి సొగసు వచ్చింది! అందులోనూ, రాక్షస స్త్రీల వర్ణనకు ప్రౌఢ సంస్కృత పదములు, వాటినుండి విముక్తమయ్యే సుకుమార అలంకారాలను గూర్చి జాను తెలుగు పదములు ప్రయోగించడం రస వ్యంజకంగా ఉంది. సీసమంతా, చక్రం రాక్షస వనితల సౌభాగ్యాన్ని పోగొట్టే విధానం వర్ణించి, చివరి ఎత్తుగీతిలో దేవ వనితల మాంగల్య రక్షణ గూర్చి చెప్పడంతో పద్యము మంగళాంతమయింది!


ఇటువంటి సీసపద్యాలను వ్రాయడంలో, తరువాత శ్రీనాధుడు ప్రసిద్ధి కెక్కాడు. ఈ పద్యమే బహుశా అతడికి మార్గం చూపెట్టి ఉండవచ్చు! అయితే సీసపద్యానికి ఉన్న ఇంత చక్కని హొయలుని కాదని, వేరే విథంగా కూడా వ్రాయవచ్చు. అది సందర్భానికి తగినదైతే, భావ వ్యంజకమైన మంచి శిల్పంగా భాసిస్తుంది. ఉదాహరణకి తిక్కన రచించిన యీ ద్రౌపదీ మనోద్వాగాన్ని పరిశీలించండి


ఈ వెండ్రుకలు వట్టి యీడ్చిన యా చేయి

దొలుతగా బోరిలో దుశ్శస్తేను

తనువింత లింతలు తునియలై చెదిరి రూ

పఱి యున్న గని యుడుకాఱు గాక

యలుపాల బొనుపడునట్టి చిచ్చే యిది

పెనుగద వట్టిన భీమస్తేను

బాహుబలంబును బాటించి గాండీవ

మను నొక విల్లెప్పుడును వహించు


కఱ్ఱి విక్రమంబు గాల్పనే యిట్లు

బన్నములు వడిన ధర్మ నందనుండు

నేను రాజరాజు పీనుంగు గన్నార

గాన బడయ మైతి మేని గృష్ణ.


దీనిని గునుగు సీసమని అంటారు. ఇందులో ముందు చెప్పిన సీసంలో చూసిన నడక లేదు. ఏ చరణానికా చరణం ఆగదు. ఇది ఇలా వ్రాయడంలోని ఔచిత్యమేమిటి? ఇవి ద్రౌపది ఒక మహోద్వేగానికి లోనయి పలుకుతున్న పలుకులు. తన సహజ గాంభీర్యాన్ని వదలి, అతి కోపాన్ని వెల్లడిస్తున్న సందర్భం. ఈ ఉద్వేగాన్ని ఏ శార్దూల మత్తేభాలలోనో వర్ణించ వచ్చు. అయితే, ఇది కేవల కోప వర్ణన కాదు. అవి ద్రౌపది పలికే మాటలు. వృత్తములలో ఇమడవు. అందుకే బహుశా తిక్కన సీసము నెన్నుకున్నాడు. ద్రౌపది తన సహజ గాంభీర్యాన్ని వదలుకున్నట్టే, సీసం తన సహజమైన హొయలుని వదలుకుంది! ఆగని ఉద్వేగం దీనివల్ల మరింత వ్యంజకమౌతోంది. ఇది ఒక మహా శిల్పం!


ఇక, సీస పద్యంలోని పాద విభజనను ఆధారం చేసికొని, శ్రీ విశ్వనాథవారు చమత్కార భరితముగా ఒక విషయాన్ని స్ఫురింప జేసిన పద్యం చూడండి


పితృవాక్య పాలనా వ్రతనిష్ఠుడవు నీవు

పితృవాక్య పాలనా వ్రతుడ నేను

ఏకపత్నీ వ్రతాహీన భావుడవీవి

ఏకపత్నీ వ్రతాహీను డేను

వివిధాస్త్ర శస్త్రాది వేతృతా ఖని వీవు

వివిధాస్త్ర శస్త్రాది వేత్త నేను

అల్పులతో యుద్ధమాడ వింతయు నీవు

అల్పులతో యుద్ధమాడ నేను


క్షోణి భృత్‌ ప్రమాణుడనేను గోణిదె డీవు

బడలి లక్ష్మిని బాసిన వాడవీవు

బడలి లక్ష్మిని బాయని వాడనేను

పోల్కి యున్నది మనకును బోల్కి లేదు

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!