Skip to main content
జాజి శర్మ గారి వజ్రం.(జోకు)
జాజి శర్మ గారి వజ్రం.(జోకు)
.
బాబురావు అబీడ్స్ లో వజ్రాల షాపు లోకి మెరుపులాంటి అందగత్తెతో చెట్టపట్టలేసుకుని అడుగుపెట్టాడు. సేల్స్ మెన్ తో " మీ షాపులో లేటెస్ట్ మోడల్ వజ్రాల హారం నా స్వీటీహార్ట్ కి చూపించండి" అన్నాడు.
" అలాగే సార్" అంటూ ఓ నాలుగైదు మోడల్స్ చూపించాడు.
" డార్లింగ్! ఇది నాకు నచ్చింది" అంటూ ఓ హరం సెలక్టు చేసుకుంది.
" సార్! అది ఏకంగా పదిహేను లక్షల రూపాయలు" అన్నాడు. సేల్స్ మెన్
" దాందేముంది. నా స్వీట్ హార్ట్ కి నచ్చిందిగా.తీసేసుకుంటున్నాము. పాక్ చేయండి" అన్నాడు బాబురావు.
"క్రెడిట్ కార్డ్! టాక్స్ పడుతుంది. కాష్ అయితే...." నసిగాడు సేల్స్ మెన్.
" టాక్స్ పడినా పరవాలేదు. పాక్ చేయండి. చెక్కు ఇస్తాను." అన్నాడు బాబురావు.
" చెక్ అయితే, క్లియర్ అయిన తరువాత మీకు హారం ఇస్తాము సార్! ఇవాళ శనివారం. మీరు సోమవారం సాయంకాలం రావాలి. అప్పుడు మీకు హారం ఇస్తాము"
" న్యాయమే కదా! కమాన్ స్వీట్ హార్ట్" అంటూ పదిహేనులక్షలకి చెక్ ఇచ్చేసి బాబురావు బయటికి నడిచాడు తన స్వీట్ హార్ట్ తో.
బాబురావు సోమవారము సాయం కాలం వజ్రాల షాపుకి వెళ్ళాడు.
బాబురావుని చూడగానే సేల్స్ మేన్ గయ్యిమని లేచాడు.
" వెధవ! అక్కౌంట్ లో చిల్లుకాని లేదు. పదిహెను లక్షలకి చెక్కిస్తావా? పిచ్చెక్కిందా నీకు"
" కూల్ బాస్! నాకు ఒక రాత్రికి బ్రహ్మండమైన విందు భోజనం,మంచి పడక వచ్ఛెటట్లు చేసిన మీ షాపుకి ధాంక్స్ చెబుదామని వచ్చా! ధాంక్స్ ఎ టన్! " అంటూ బయటకు నడిచాడు బాబురావు.
Comments
Post a Comment