ధిమిత... ధిమిత!

ధిమిత... ధిమిత!

అన్ని పండగల్లోనూ, ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ నలుగురు ఆడపిల్లలు కలిస్తే చాలు, ఈ చెమ్మ చెక్క ఆటను ఎదురు బొదురుగా నిలబడి, చేతులు చాచి, ఒకరి చేతులు మరొకరికి తాటిస్తూ, ఎగురుతూ, గెంతుతూ, వెనకకు ముందుకూ వూగుతూ, అడుగుల లయకు చేతులు తట్టుతూ, పాటలు పాడుతారు. రంగు రంగుల దుస్తులతో వలయాకారంగా, వరుసన తప్పకుండా నృత్యం చేస్తూ వుంటే,అంగ రంగ వైభోగంగా వుంటుంది. మధ్య మధ్య, ఒకరి కొకరు ప్రశ్నకు సమాధానంగా ఇలా ప్రారంభిస్తారు.

ధిమిత... ధిమిత

ఏమి ధిమిత? పసుపు ధిమిత

ఏమి పశుపు? తోట పసుపు

ఏమి తోట? ఆకుతోట?

ఏమి ఆకు? తమలపాకు

ఏమి తమ్మ? పుట్ట తమ్మ.

ఏమి పుట్ట? పాము పుట్ట

ఏమి పాము? త్రాసు పాము

బాలిక లందరూ ఇలా పాడుతూ వుంటే బాలురు మరో గమ్మత్తు పాట పాడుతారు. చూడండి.

ఏమి త్రాచు? నల్లత్రాచు.

భూమికి తాళం వేస్తే ... రంగా

భోగందానికి ... సవరం దొరికె

సవరం బట్టుకెళ్ళి సాని కిస్తే

సాని నాకు జాబులు ఇస్తే

జాబులు పట్టు కెళ్ళి మామ కిస్తే

మామ నాకు పిల్లనెచ్చే

పిల్ల పేరు మల్లి మొగ్గ

నా పేరు జమీదార్.

ఇలాంటిదే మరొకటి.

కాకీ కాకీ కలవల కాకీ

కాకిని పటుకెళ్ళి గంగలో ముంచితే

గంగ నాకు గంధం ఇచ్చె

గంధం పట్టుకెళ్ళి ... ఆవుకు రాస్తే

ఆవు నాకు పాలు ఇచ్చే

పాలు పట్టుకుని అమ్మకు ఇస్తే

అమ్మ నాకు జున్ను ఎచ్చే

జున్ను పట్టు కెళ్ళి ... పంతులు కిస్తే

పంతులు నాకు పజ్జెం చెప్పె

పజ్జెం పట్తుకెళ్ళి మామకు ఇస్తే

మామ నాకు పిల్లనెచ్చే.

పల్లా పేరు మల్లి మొగ్గ

నాపేరు జమీందార్.

అంటూ పిల్లలిలా కేరింతలు కొడుతూ, తద్దె పండుగలలో బృందాలు బృందలుగా చేరి ఆటల పాటలతో అందరినీ అలరిస్తారు.

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!