చెమ్మచెక్క .. చారడేసి మొగ్గ!

చెమ్మచెక్క .. చారడేసి మొగ్గ!

.


చెమ్మచెక్క.. చారడేసి మొగ్గా..

అట్లు పొయ్యంగా.. ఆరగించంగా..


ముత్యాల చెమ్మచెక్క.. ముగ్గులెయ్యంగా..

రతనాల చెమ్మచెక్క.. రంగులెయ్యంగా..

పగడాల చెమ్మచెక్క.. పదిరెయ్యంగా..

పందిట్లో మా బావ... పెండ్లి చెయ్యంగా..


సూర్య దేవుడి పెండ్లి... చూసి వద్దాం రండి

మా వాళ్ళింట్లోకి వెళ్ళి... మళ్లీ వద్దాం రండి


అంటూ ఆడపిల్లలు అన్ని పండగల్లోనూ, ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ నలుగురు ఆడపిల్లలు కలిస్తే చాలు, ఈ చెమ్మ చెక్క ఆటను ఎదురు బొదురుగా నిలబడి,

చేతులు చాచి, ఒకరి చేతులు మరొకరికి తాటిస్తూ, ఎగురుతూ, గెంతుతూ, వెనకకు ముందుకూ వూగుతూ, అడుగుల లయకు చేతులు తట్టుతూ, పాటలు పాడుతారు. 

రంగు రంగుల దుస్తులతో వలయాకారంగా, వరుసన తప్పకుండా నృత్యం చేస్తూ వుంటే,అంగ రంగ వైభోగంగా వుంటుంది. .

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!