శబ్ద బోధ మీమాంస !

శబ్ద బోధ మీమాంస !

(Vvs Sarma గారికి కృతజ్ఞలతో )

.

वागर्थाविव संपृक्तौ वागर्थप्रतिपत्तये।

जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ॥ १-१

.

ఇది కాళిదాస మహాకవి రఘువంశ మహాకావ్యంలో ఆరంభ ప్రార్థనా శ్లోకం.

శబ్దము (వాక్కు) అర్థము వలె అత్యంత సన్నిహితమైన సంబంధము కలిగి యుండి జగత్తుకు తల్లితండ్రులైన పార్వతీ పరమేశ్వరులకు సమ్యక్ జ్ఞానమునకై నమస్కరిస్తున్నాను.

ఈ శ్లోకమునకు అనేక విధములైన వ్యాఖ్యానములు చేయ బడినవి. 

.

వాచ్ वाच् అనే స్త్రీ లింగ శబ్దం పార్వతీదేవితోను, అర్థః అనే పుల్లింగ శబ్దము పరమేశ్వరునితోను పోల్చబడినవి.

నమః శివాయ అనే మంత్రం శబ్దమును సూచిస్తే దాని అర్థం శివుడే. 

ఇద్దరి నామాలు ఒకటే .

శివా (స్త్రీ) శివః (పుం). శబ్దమునకు అర్థమునకు గల సంబంధం 

న్యాయ తర్కాలలో కూడా చాలా ముఖ్యమైనది. 

దీని పరామర్శను శబ్ద బోధ మీమాంస అంటారు. 

అశ్వత్థామ హతః .... కుంజరః అనే శబ్దము సత్యమా, అనృతమా అని 

పరీక్షించుటకు ఇది అవసరమౌతుంది.

वाक्यं स्याद्योग्यताकांक्षासत्तियुक्तः पदसमूहम యోగ్యత, ఆకాంక్ష, ఆ

సత్తి అనే లక్షణములు గల పద సమూహము.

యోగ్యత అంటే పదాల మధ్య సరియైన సంబంధం ఉండాలి. అశ్వత్థామ ... 

ఒక ఏనుగ పేరు అనడం అప్రస్తుత ప్రసంగం. 

అశ్వత్థామ హతః అని చెప్పి ఆసమాచారం ద్రోణునికి చేర్చడమే అక్కడ 

ఆకాంక్ష. స్వల్ప సమయం తరువాత ఏనుగ అనడం సత్య పరిపాలన

అనేభ్రమతో ఆత్మవంచనే. సత్య వాక్యంలో అశ్వత్థామ ఏనుగ పదాలు 

సమీపవర్తులై ఉండాలి. ధర్మరాజు వచనంలో ఆసత్తి లోపించింది.

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!