మరి ఒక జంఘాల శాస్త్రి గారి ప్రసంగం !

మరి ఒక జంఘాల శాస్త్రి గారి ప్రసంగం !

(Ramabrahmam Varanasi గారి మరి ఒక జంఘాల శాస్త్రి గారి ప్రసంగం .
)
.

.

జంఘాల శాస్త్రి : కాలక్షేపమునకై కొందరము, మన స్వోత్కర్షల ప్రకటనకై 

ఎందరమోఅంతర్జాలమును ఆశ్రయించి ఉన్నాము; 

కవులు తమ కవితా పఠనమునకు పాఠకులకై, 

నాట్యకత్తెలు, సంగీత విదుషీమణులు,విద్వాంసులు, చిత్రకారులు, 

తమ తమ కళల ప్రస్థానము ప్రకటించుటకై

మేధావులు, పండితులు తమ తమ బుద్ధి కుశలతల, పాండిత్యముల

జనుల అలరించుటకై, వారికి మార్గనిర్దేశకులగుటకై వేంచేసి నిండుతున్నారు అంతర్జాల సాలిగూళ్ళ స్థలములలో;

నేటి కాలపు రచ్చబండలు, అమ్మలక్కల కబుర్లకు నిలయములై కాలక్షేపమో, వ్యసనమో నిర్ధారించుటకు వీలు లేని తమాషా ప్రదేశములై అందర ఆకట్టుకొన్నవి; 

ప్రణయ ప్రదేశములై, వదలలేనితనమును, విరహమును కల్గించుచు

మానసిక కార్యకలాపములను నిర్దేశించుచున్నవి; 

మానసిక వికారములను కల్గించుచు, అనారోగ్యముల పాలు చేయుచున్నవి; 

విడలేని బంధములవాడని, వీడని నిత్య నూతన అనుభవముల అందించుచు, 

మన మనమై, మనమై మమేకమై పోయినవి; బానిసలమైతిమి 

మనము; సినిమా, టివిలత్రోసిరాజనుచు; ఒక్కొక్క తరమునకొక

సాంకేతిక విజ్ఞానము; మనలమన జీవిత గమనముల ప్రభావితము చేయుచు, వినోదపరచుచు; మనల మనోవికాసమునకు,ముఖ్య చదువుకు నిరంతరముగ దూరముచేయుచు..


Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!