మహేశా పాపవినాశా!

మహేశా పాపవినాశా!

మహేశా పాపవినాశా పాట కాళహస్తి మహాత్యం (సినిమా) కోసం
తోలేటి వెంకటరెడ్డి రచించారు.
దీనిని ఘంటసాల వెంకటేశ్వరరావు గానం చేయగా ఆర్. సుదర్శనం
సంగీతాన్ని అందించారు.
(పాట సాహిత్యం)
.
ఓం నమశ్శివాయా నవనీత హృదయా
తమ ప్రకాశా తరుణేందుభుషా నమో శంకరా దేవదేవా
మహేశా పాపవినాశా కైలాసవాసా ఈశా
నిన్ను నమ్మినాను రావా నీల కంధరా దేవా
భక్తియేదొ పూజలేవో తెలియనైతినే
పాపమేదొ పుణ్యమేదో కాననైతినే దేవా
మంత్రయుక్త పూజ సేయా మనసు కరుగునా
మంత్రమో తంత్రమో ఎరుగనైతినే
నాదమేదో వేదమేదో తెలియనైతినే
వాదమేల పేదబాధ తీర్చరావయా స్వామి
ఏకచిత్తమున నమ్మిన వారికి శోకము తీర్చువొ రుద్రయ్య
ప్రాకటముగ చిరువేట చూపి నా ఆకలి తీర్పగ రావయ్య
దీటుగ నమ్మితి గనవయ్య వేట చూపుమా రుద్రయ్య
వేట చూపుమా రుద్రయ్య వేట చూపుమా రుద్రయ్య

https://www.youtube.com/watch?v=PSc7Ue2c3FE

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!