రమణ మహర్షి

ఒక ఉడుత ఎప్పుడూ లాగే రమణ మహర్షి దగ్గరకు వచ్చింది, ఆయన దానికి జీడిపప్పు పెడుతున్నారు. అప్పుడు ఆయన ఇలా అన్నారు. " నిన్న ఒక భక్తుడు కొన్ని జీడిపప్పులు నా ఈ మూగ స్నేహితుల కోసం పంపాను అన్నాడు. కాని ఇవి మూగావి కావు. అవి నాతో మాట్లాడుతాయి. ఎప్పుడైనా నేను స్వల్ప నిద్రలో ఉన్నప్పుడు అవి నా దగ్గరకు వచ్చి నా వేళ్ళు కొరికి మరీ నా ధ్యానము వాటి పైకి మలచుకుంటాయి. అంతే కాదు వాటికి తమ సొంత భాష ఉంటుంది. ఉడుతలలో ఒక గొప్ప నేర్చుకోవలసిన విషయం ఉంది. వాటి ముందు మీరు ఎంత ఆహారము పెట్టినా, అవి వాటికి ఎంత కావాలో అంత తిని వెళ్ళిపోతాయి. అవి ఎలుకల వలె దొరికినది అల్లా తీసుకుని తమ చిల్లి లో దాచుకోవు. "

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!