ఈ రోజు వైకుంఠ ఏకాదశి..మహాపర్వదినం

ఈ రోజు వైకుంఠ ఏకాదశి..మహాపర్వదినం 

దేవాలయంలో స్వామికి వజ్రకిరీట ధారణ 

తండోపతండాలుగా జనసందోహం 

ఇసుకవేస్తే రాలడంలేదు 

దేవాదాయ మంత్రివర్యులు కూడా విచ్చేసారు 

ప్రసాదాలు గుండిగెలతో బారులు తీరి వున్నాయి 

దొన్నె అయిదురూపాయలు 

ఎగబడి కొంటున్నారు భక్తులు 

కోట్లుఖరీదుచేసే ఆకిరీటంకేసి, 

ప్రసాదాల గుండిగల కేసి 

ఆబగా చూస్తున్నారు 

వరదల్లో సమస్తంకోల్పోయిన భాధితులు...

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!