కోడలా కోడలా కొడుకు పెళ్ళామా......

కోడలా కోడలా కొడుకు పెళ్ళామా!

.

కోడలా కోడలా కొడుకు పెళ్ళామా

పచ్చి పాల మీద మీగడలేవి?

వేడి పాల మీద వెన్నల్లు యేవి?

నూనెముంతల మీద నురగల్లుయేవి?

అత్తరో ఓయత్త ఆరళ్ళయత్త

పచ్చిపాల మీద మీగడుంటుందా?

వేడిపాల మీద వెన్నలుంటాయా?

నూనె మంతల మీద నురగలుంటాయా?

కోడలా కోడలా కొడుకు పెళ్ళామా!

కోడుకు ఊళ్ళోలేడు మల్లెలెక్కడివి?

గంపంత మబ్బేసి గాలి విసిరింది

కొల్లలుగ మల్లెలు కొప్పులో రాలె

ఇరుగు పొరుగులార! ఓ చెలియలార

అత్తగారి ఆరళ్ళు చిత్తగించరా?

పెత్తనం లాగేస్తే పేచీలుపోను

ఆరళ్ళ అత్తయిన సవతి పోరయిన

తల్లిల్లు దూరమైన భరియించలేము.

http://www.youtube.com/watch?v=lFLSN0jiu5E

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!