శ్రీ రుక్మిణీశ కేశవ.....

శ్రీ రుక్మిణీశ కేశవ

నారద సంగీతలోల /నగధర శౌరీ

ద్వారక నిలయ జనార్ధన

కారుణ్యముతోడ మమ్ము/గావుము కృష్ణా!


రుక్మిణీదేవికి భర్తవు,పరమేశ్వరుడవు,నారదుడు చేయు గానమందు ఆసక్తి గలఁవాడవు.కొండనెత్తిన వాడవు.ద్వారకా పట్టణమందు నివసించువాడవు.జనులు అను రాక్షసులను చంపిన వాడవు.అయిన ఓ కృష్ణా!దయతో మమ్ములను రక్షించుము.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!