“ భోజనం దేహి రాజేంద్రా ఘ్రుత సూప సమన్వితం


“ఒకరోజు భోజుని ఆస్థానానికి ఒకకవి వచ్చి, చక్కని కవిత్వం చెప్పి, సన్మానింపబడిన పిదప, మంచి భోజనం పెట్టమని అడుగుతాడు. రాజుగారు ఎటువంటి భోజనం కావాలి? అని ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆ కవి తనకి కావలసిన పదార్థాలని చక్కని కవితారూపంలో ఇలా అడుగుతాడు.-


“ భోజనం దేహి రాజేంద్రా ఘ్రుత సూప సమన్వితం 

మాహిషంచ శరశ్చంద్ర చంద్రికా ధవళం దధి”

 అనగా “ఓ రాజా! నాకు మంచి భోజనం పెట్టు. ఆ భోజనంలోకి మంచి నెయ్యి,పప్పు మొదలగు పదార్థాలతోపాటు, శరత్ కాలంలోని చంద్రుని కిరణాలవలె తెల్లగా ఉన్న గేదె పాలతో తయారైన గడ్డ పెరుగు కూడ కావాలని కోరుతాడు. పెరుగును కవితాత్మకంగా వర్ణించిన విధానానికి భోజరాజు సంతసించి, చక్కని భోజనం పెట్టి, మరల ఘనంగా సత్కరించి పంపుతాడు. 

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!