యజ్ఞోపవీతం పరమం పవిత్రం”

“ శృంగారాది నవరసాలలో హాస్యానిది రెండవ స్థానం. సంభాషణా చాతుర్యం ద్వారా,

హావభావ విన్యాసం ద్వారా మనసుకు హాయిని కలిగించేది హాస్యం”

హాస్యానికి ఆలంబనాలు చాటువులు. చమత్కార జనితమైన ఈ చాటువులు కొన్ని శృంగార భరితంగా కూడ ఉంటాయి. కాళిదాసు పేరుతో ప్రసిద్ధి పొందిన ఈ చాటువుని చదివి ఆనందించండి.

“ఆణోరణీయాన్ మహతో మహీయాన్

మధ్యో నితంబశ్చ మదంగనాయాః

తదంగ హారిద్ర నిమజ్జనేన 

యజ్ఞోపవీతం పరమం పవిత్రం”

దానిభావం పరిశీలిద్దాం - మొదటి పాదం “ఆణువుకన్నా చిన్నదైన పరమాణువు అనగా కనీకనిపించనిది అనికదా భావం. అట్లే మహత్తు కన్నా మహత్తు పెద్దవాటిలో పెద్దది అనికదాభావం. అవి అందమైన, యవ్వనంలో ఉన్న స్త్రీయొక్క మధ్యమము అనగా (సన్నని) నడుము, మరియు నితంబము పెద్దది గాను ఉన్నదనియు, అట్టి స్త్రీని ఆలింగనం చేసికొన్నపుడు, ఆమె ఒంటికి రాసుకొన్న పసుపుతో కలసిన యజ్ఞోపవీతము, పరమ పవిత్రమైనది కదా!”

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!