ఇతి హస సుందరి టిజి కమల దేవి. (By Tvs Sastry garu)

ఇతి హస సుందరి టిజి కమల దేవి. (By Tvs Sastry garu)

పాతాళభైరవి చిత్రం 1951లో కాబోలు వచ్చింది. అందులో ఆదిలో ఇతిహాసం విన్నారా అన్న పాట బుర్రకథగా వినిపిస్తుంది. పాడినదీ నటించినదీ టిజి కమలాదేవి.

ఆమెను చూశాక హీరోయిన్ మాలతిని చూసి – కమలవంటి అందగత్తె ఉండగా మాలతిని ఎందుకు ఎంపిక చేశారా అనిపించింది. ఆతర్వాత మల్లీశ్వరి కూడా ఆ ఏడే చూశాను. అందులో టిజి కమల చిన్న చెలికత్తె పాత్రలో తుమ్మెదా అని పాడుతూ కనిపిస్తుంది.

ఆమె భానుమతికంటే అందంగా అనిపించింది. ఆస్తులూ అంతస్తులూ (1969లో కావచ్చు) చిత్రంలో గయ్యాళి అత్తగా చూసినప్పుడు అచ్చం ఎస్. వరలక్ష్మిలా ఉన్నదనుకున్నాను. చిత్రం పేరు అదేనని ఖచ్చితంగా చెప్పలేను. ఎందుకంటే అమె వివరాలలో ఈ చిత్రం పేరు లేదు> ఆమె రూపం, గొంతు, హావభావాలు అంతలా ముద్ర వేశాయి. మాటివి గుర్తుకొస్తున్నాయి శీర్శికలో ఆమెతో ఇంటర్వ్యూ నిర్వహించింది.. తాజమహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరు అని మహాకవి వాపోయాడు కానీ

– మనకి మహాప్రభువుల్నే తప్ప మహామహుల్ని సంస్మరించే అలవాటు లేదనడానికి

మాన్యులు శ్రీ పివి నరసింహారావుగారే నిదర్శనం. ఈ ఆగస్ట్ 16న ఆ కళామూర్తి వేరే లోకానికి వెళ్లిపోయింది.


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!