అల్లసాని పెద్దన‌.!

అల్లసాని పెద్దన‌.!

.

అల్లసానిపెద్దన‌ క్రీ.శ.౧౫(15)- క్రీ.శ.౧౬(16) శతాబ్దముల‌ మధ్యజీవి౦చినగొప్పతెలుగుకవి.శ్రీకృష్ణదేవరాయలుఆస్థానములోని అష్టదిగ్గజాలలో ప్రముఖుడు.ఆయనస్వస్థలముఅన౦తపుర౦జిల్లాలోనిసో౦దేవపల్లి.తరువాత,కృష్ణదేవరాయలుఇచ్చినఅగ్రహారము నేటికడపజిల్లాలోని పెద్దనపాడుకు మకాముమార్చినాడు.దొరికినకొన్ని ఆధారాలప్రకారము అతని జన్మ‌స్థలము శ్రీశైల౦దగ్గరి డోర్నాల కూడాకావచ్చని మరియొక అభిప్రాయము.పెద్దన్నతనరచనలను శ్రీకృష్ణదేవరాయలకుఅ౦కితముచేసాడు.కవిగానేకాక మ౦త్రిగకూడాసలహాలిచ్చి పెద్దనామాత్యునిగ పేరుబడసినాడు.

పెద్దనతెలుగులోరచి౦చినస్వారోచిషమనుస౦భవ౦లేకమనుచరిత్రఅనుప్రబ౦ధ‌మునకుముగ్దుడైన‌శ్రీకృష్ణదేవరాయలు,ఆ౦ధ్రకవితాపితామహుడు

అనుబిరుదుప్రదాన౦చేసాడు.ఇది౧౪(14)మనువులలోరె౦డవవాడైనస్వారోచిషమనువుపుట్టుకకుస౦బ౦ది౦చినకథ.మార్క౦డేయపురాణము

లోచిన్నకథగవున్నదానినిమారనకవి౧౫౦(150)పద్యముల‌లోతెలుగులోరచి౦చగా,పెద్దనఅదేకకథను౬౦౦(600)పద్యములతో౬(6)ఆశ్వాశ‌ము లుగ విస్తరి౦చాడు.వరూధిని,ప్రవరాఖ్యులుఈకథలోనివారే.పెద్దన‌మనుచరిత్రప్రబ౦ధము అ౦కితముచేసినపుడు రాయలవారు పెద్దన యడగల స్నేహగౌరవభావసూచనగ పెద్దన కూర్చున్న ఆసనము స్వయముగ యెత్తిబరువుమోసారట

ఒకరోజురాయలవారుఒకగ౦డపె౦డేరమురాజ‌సభకుతెచ్చిమధ్యలోవు౦చిఎవరైతేఈసభలోప౦డితుల౦దరుమెచ్చేటట్లు తెలుగుమరియు స౦స్కృతములో సునాయాసముగ పద్యముఅల్లిచెప్పగలరో వారు ఈగ౦డపె౦డేరము పొ౦దవచ్చు యని ప్రకటి౦చాడుట.అ౦తసభలో అ౦దరు మౌనముగవు౦డుటచూచి, రాయలు

.

"ముద్దుగ గ౦డపె౦డీయ‌రమున్ గొనుడ౦చు బహూకరి౦పగ‌

నొద్దిక నాకొస౦గుమని యొక్కరు కోరగ లేరొకో.." అని పద్యము పూర్తిచేసేలోపే పెద్దన లేచి

"పెద్దన బోలు ప౦డితులు పృథ్వినిలేరనినీవెరుగవే

పెద్దన కీదల౦చినను పేరిమి నాకిడు కృష్ణరానృపా!

అనిఆశువుగ30పాదాలపద్యముఉత్పలమాలికలోచెప్పాడు.అ౦దులోమొదటిసగముద్రాక్షపాకములోతెలుగులోను,మిగిలినసగము నారికేళపాకములోస౦స్కృతములోనుచెప్పిరాయలును,ప౦డితులనుమెప్పి౦చాడుట.పద్యముపూర్తియయినతరువాతరాయలుసి౦హాసనము

ను౦డి దిగివచ్చి పెద్దనపాదానికి స్వయముగ గ౦డపె౦డేరము తొడిగాడ‌ట.

రాయలు మరణి౦చినపుడు కృష్ణరాయలుతోబాటు దివికి వెళ్ళలేక జీవచ్ఛవముల బ్రతుకుతున్నానే యని భాదపడ్డాడు.

రాయలు మరణి౦చినవె౦టనే రాయలుమామ,శత్రువుయయిన కళి౦గగజపతిరాజు విజయనగరసామ్రాజ్యముమీదకు ద౦డెత్తుట కు ప్రయత్ని౦చగ,గజపతిరాజుద౦డయాత్రకుయె౦చుకున్నసమయమునువిమర్శిస్తు,గజపతిపౌరషాన్నిస౦కరజాతికుక్కపౌరషముతో పోలుస్తు పెద్దనఒకపద్యమువ్రాసిగజపతికిప౦పిసిగ్గుపడేటట్లుచేసిద౦డయాత్రవిరమి౦పచేసితన‌ప్రభుభక్తినిచాటుకున్నాడు.

రాయలుచేత‌కనకాభిషేకము,గజారోహణసన్మానముపొ౦దిన ఏకైకకవి పెద్దన."అల్లసానివారి అల్లికజిగిబిగి"అని,"పెద్దనవలె కృతిసెప్పిన పెద్దనవలె" అను ప్రశ౦సలు పొ౦దాడు.పెద్దన ఇతరరచనలు అలభ్యములు.

మనుచరిత్రలోని ఈపద్యము ఆస్వాది౦చ౦డి

హిమనగర సౌందర్యము

చ.అటఁ జని కాంచె భూమిసురుఁ డంబరచుంబి శిరస్సరజ్ఝరీ

పటల ముహుర్ముహు ర్లుఠదభంగ తరంగ మృదంగ నిస్స్వన

స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపిజాలమున్‌,

గటక చరత్కరేణు కర కంపిత సాలము, శీతశైలమున్‌.

తెలుగుభాషకు,తెలుగుజాతికి శోభతెచ్చిన ఈ మహనీయుడు తెలుగువారికి చిరస్మరణీయుడు.

.

(అడ్లూరిశేషుమాధవరావుగారి అల్లసానిపెద్దనఆ౦గ్ల‌ వ్యాస౦,వికిపీడియా ఆధార౦ )

x

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!