మంచినీళ్ళ బావి.!

మంచినీళ్ళ బావి.!


-అరిపిరాల సత్యప్రసాద్


తెల్లగా తెల్లారాక చివరగా నీళ్ళు తోడుకున్నవాళ్ళు ఎవరైనా సరే ఒక చేద నీళ్ళు తోడి గట్టుమీద పెట్టి వెళ్ళేవాళ్ళు. ఆ పక్కగా పోతున్నవాళ్ళెవరైనా దాహం వేస్తే అక్కడికి వెళ్ళి నాలుగు దోసిళ్ళు ముఖాన కొట్టుకోని, చేద ఎత్తి గడ గడా నీళ్ళు తాగేవాళ్ళు. మళ్ళీ మర్చిపోకుండా నీళ్ళు తోడి గట్టు మీద పెట్టి వెళ్ళేవాళ్ళు. ఎవరైనా మర్చిపోయినా అక్కడే పెద్ద బాడిసె పెట్టుకొని కూర్చున్న సాంబయ్యో, గట్టు పక్కన బండపైన పులి జూదం ఆడుతున్న బసవయ్యో ఒక చురకేసేవాళ్ళు -

“ఏరా.. ఇంకొకళ్ళు తోడిన నీళ్ళు తాగినోడివి.. నీ తరవాత వచ్చేవాళ్ళకి ఒక చేద తోడి పెట్లేవంట్రా.. ఒక్క చేదకేమైనా నీ ఒళ్ళు అరిగిపోతుందా” అనేవాళ్ళు.


ఎన్నో ఏళ్ళ క్రిందటి మాట. మా వూరిమధ్యలో శివాలయాన్ని ఆనుకోని ఒక పెద్ద మంచినీళ్ళ బావి ఉండేది. ఎప్పుడో రాజుల హయాంలో కట్టించిన ఆ బావి దాదాపు వూరు మొత్తానికి నీళ్ళు అందించేది. నాలుగు వైపులా నాలుగు గిలకలు రోజంతా కిలకిలమంటూ కళకళలాడుతుండేది. తెల్లవారుఝామున ఏ నాలుగింటికో శివాలయం పూజారి దక్షిణామూర్తిగారు బావిని నిద్రలేపి చన్నీళ్ళ స్నానం చేసి, తడిగుడ్డతో నాలుగు బిందెలు మడినీళ్ళు పట్టుకోని రుద్రం నమకం చదువుకుంటూ గుళ్ళోకి నీళ్ళు మోసుకెళ్ళేవారు. అప్పటికే అక్కడికి చేరుకున్న బ్రాహ్మణవీధి ఆడంగులంతా దక్షిణామూర్తిగారి స్నానం అయ్యేదాక ఆగి, ఆ తరువాత ఏ వచనరామాయణమో పాడుకుంటూ బావికి పసుపు అద్ది, బొట్లు పెట్టి, గిలకలమీద చేదలేసేవారు. ఇక అక్కడినించి ఆ బావి చలివేంద్రంలా రోజంతా జలదానం చేస్తూనే వుండేది.


కొంచెం తెలవారుతుండగా ఆడవాళ్ళ వరస మొదలయ్యేది. కులం ప్రాతిపదికన వేళల్లో మార్పులుండేవిగాని ఫలానా కులం వాళ్ళు నీళ్ళు పట్టుకోకూడదని ఎవ్వరూ అనేవారు కాదు. అప్పుడే నిఖా అయ్యి మా వూరు వచ్చిన నూర్‌జహాన్, బిందెతో అక్కడికి వచ్చి నీళ్ళు తోడుకోడానికి వెనకా ముందు ఆడుతుంటే సెట్టెమ్మగారు చూసి -


“ఏమ్మా కొత్త కోడలా.. అట్టా ఒక అడుగు ముందుకి రెండడుగులు వెనక్కి వేస్తే ఇంక ఇంటికి నీళ్ళు చేర్చినట్టే.. రా, నేను తోడి పెడతాను..” అంటూ వద్దన్నా వినకుండా బిందె నిండా తను తోడుకున్న నీళ్ళు పోసి పంపేది. “కొత్త కోడలుకదా నీళ్ళబావి దగ్గర ఎక్కువసేపు వుంటే ఆ అత్తగారు ఏం సాధిస్తుందో.. పోనీలే పాపం ఒక్క బిందె నీళ్ళిస్తే మాత్రం ఏం పోతుంది” అనేది మిగతా ఆడంగులతో. బావిలో నీళ్ళు నవ్వుతూ సుడులు తిరిగేవి.


తెల్లగా తెల్లారాక చివరగా నీళ్ళు తోడుకున్నవాళ్ళు ఎవరైనా సరే ఒక చేద నీళ్ళు తోడి గట్టుమీద పెట్టి వెళ్ళేవాళ్ళు. ఆ పక్కగా పోతున్నవాళ్ళెవరైనా దాహం వేస్తే, అక్కడికి వెళ్ళి నాలుగు దోసిళ్ళు ముఖాన కొట్టుకోని, చేద ఎత్తి గటగటా నీళ్ళు తాగేవాళ్ళు. మళ్ళీ మర్చిపోకుండా నీళ్ళు తోడి, గట్టు మీద పెట్టి వెళ్ళేవాళ్ళు. ఎవరైనా మర్చిపోయినా అక్కడే పెద్ద బాడిసె పెట్టుకొని కూర్చున్న సాంబయ్యో, గట్టు పక్కన బండపైన పులి జూదం ఆడుతున్న బసవయ్యో ఒక చురకేసేవాళ్ళు -


“ఏరా.. ఇంకొకళ్ళు తోడిన నీళ్ళు తాగినోడివి.. నీ తరవాత వచ్చేవాళ్ళకి ఒక చేద తోడి పెట్లేవంట్రా.. ఒక్క చేదకేమైనా నీ ఒళ్ళు అరిగిపోతుందా” అనేవాళ్ళు.

x

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!