ఇస్లియే… కాబట్టి మన మన జీవిత యుద్ధాలు మనమే చేసుకొనవలెను.

.
“ఎవరో వస్తారని ఏమో చేస్తారని
ఎదురు చూసి మోసపోకుమా
నిజం మరచి నిదురపోకుమా”
.
అని ఓ సినీ కవి హెచ్చరించి, ఒరేయ్ మామూలు మనిషీ!
ఈ యుద్ధం నీది, నీ యుద్ధం నువ్వే చేయాలి…
లే పోరాడు, పోరాటం లేకపోతే బతుకుబండి సాగదు అన్చెప్పాడు.
.
అదే విషయం మన గీత కూడా చెప్పింది.
.
ఏ గీతా? మీ పక్కింటమ్మాయి పొడవాటి చెవి లోలాకులూ.. పొట్టి జుత్తూ,
ప్యాంటూ షర్టూ వేసుకుని ఎమ్మే ఇంగ్లీషు చదివి ఎలిమెంటరీ స్కూల్లో
తెలుగు పాఠాలు చెబుతుందే ఆ పిల్లా? అనడక్కండి..
.
ఆ గీత కాదు.. భగవద్గీతండీ
(అబ్బో వీడు మళ్లీ యింకో సంస్కృత శ్లోకంతో మన్నేడిపించేస్తాడ్రా బాబో అనుకుంటున్నారా? కరక్టే ఏడవండి)
.
ఆత్మ సంయమ యోగంలో ఈ శ్లోకం చూడండి –
“ఉద్ధరేదాత్మ నాత్మానం నాత్మానమవసాదయేత్
ఆత్మైవ హ్యాత్మనో బన్ధురాత్మైవ రిపురాత్మవః”
.
అంటే, ‘నాయినా! నిన్ను నువ్వు ఉద్ధరించుకో, నిన్ను నువ్వు అధోగతి పాల్చేసుకోకూ.. నీకు నీవే బంధువ్వి, నీకు నీవే శత్రువు కూడానూ తెలిసిందా’ అని…
అంటే శాస్త్రాలూ, దేముళ్లూ, సాములోళ్లూ, గురూగార్లూ ఎందరున్నా… చూపుడు వేల్తో అదో అదే నీ దారి అని అన్చూపుతారే తప్ప నిన్ను మోసుకెళ్లరు…
.
ఆ దారెంబడ నడిచి ఛావల్సింది నువ్వే. అని కదా! సో… అందువలన…

(కాశీభట్ల వారి మార్కుతో.)

Comments
Post a Comment